హైదరాబాద్: అక్రమ అరెస్ట్ కేసులో సంజీవరెడ్డి నగర్ ఎస్ఐ  ఆశోక్ నాయక్‌కు నాలుగు వారాల పాటు జైలు శిక్షను విధించింది తెలంగాణ హైకోర్టు. 

రామడుగు ఓంకార్ వర్మ ఎస్ఐపై దాఖలు చేసిన కోర్టు ధిక్కరణ కేసును దాఖలు చేశారు. ఈ కేసులో ఎస్ఐ‌పై కోర్టు ఈ శిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చింది.హైద్రాబాద్ బోరబండ కు చెందిన  ఒంకార్ వర్మపై అదే ప్రాంతానికి చెందిన పద్మ కేసు పెట్టింది.  బోరబండలో ఒంకార్ వర్మ స్టేషనరీ దుఖానం నడిపేవాడు.

తన ఇంట్లో నిధి ఉందని  పద్మ అనే మహిళను వర్మ మోసం చేసినట్టుగా ఆమె కేసు పెట్టింది.ఈ నిధి విషయంలో తనను మోసం చేసినట్టుగా ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది.

అంతేకాదు తన నుండి రూ. 10వేలను కూడ వర్మ తీసుకొన్నట్టుగా ఆమె పోలీసులకు పిర్యాదు చేసింది. అంతేకాదు కొంతకాలానికి అతను కన్పించకుండా వెళ్లినట్టుగా పద్మ పోలీసులకు ఫిర్యాదు చేసింది.

ఈ కేసుకు సంబంధించి కోర్టు ఎఫ్ఐఆర్‌ను పరిశీలించింది.  ఎప్పుడు వర్మను పద్మ కలిసింది. ఏ రోజున ఆమె వర్మకు డబ్బులు ఇచ్చింది. ఏ రోజున ఇంట్లో నిధి కోసం తవ్వకాలు జరిపారనే విషయాలు ఎఫ్ఐఆర్‌లో  లేవని కోర్టు అభిప్రాయపడింది.

అంతేకాదు  ఈ రకమైన వివరాలు లేకుండానే  ఏడేళ్ల కంటే ఎక్కువ కాలం పాటు శిక్షకు గురయ్యే వర్మపై సెక్షన్లు  పెట్టడంపై  హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.
ఈ కేసులో పెట్టిన సెక్షన్లపై హైకోర్టు అభ్యంతరం వ్యక్తం చేసింది.దీంతో ఎస్ఐకు నాలుగు వారాల పాటు జైలు శిక్షను విధిస్తూ కోర్టు తీర్పు చెప్పింది.