Asianet News TeluguAsianet News Telugu

‘మాకు రాబందులు కావాలి’... మహారాష్ట్రను అర్థించిన తెలంగాణ.. !

సెంట్రల్ జూ అథారిటీ నుంచి అనుమతి రాగానే వాటిని తీసుకువచ్చి సంరక్షించి సంతతి పెంచాలని అటవీశాఖ భావిస్తోంది. ఆసిఫాబాద్ అడవుల్లో రాబందుల ఏకైక స్థావరమైన పాలరావుగుట్టలో ఏడాది నుంచి వాటి జాడే లేదు. 

Telangana seeks vultures from Maharashtra for captive breeding - bsb
Author
Hyderabad, First Published Jul 30, 2021, 1:00 PM IST

రాష్ట్రంలో రాబందులు కనుమరుగై పోవడంతో మహారాష్ట్ర నుంచి పదింటిని రప్పించడానికి రాష్ట్ర అటవీ శాఖ ప్రయత్నిస్తోంది. ఇరు రాష్ట్రాల ఉన్నతాధికారులు ఇటీవల సమావేశమై చర్చించగా ఐదు జటల రాబందుల్ని ఇచ్చేందుకు మహారాష్ట్ర ఆమోదించింది. 

సెంట్రల్ జూ అథారిటీ నుంచి అనుమతి రాగానే వాటిని తీసుకువచ్చి సంరక్షించి సంతతి పెంచాలని అటవీశాఖ భావిస్తోంది. ఆసిఫాబాద్ అడవుల్లో రాబందుల ఏకైక స్థావరమైన పాలరావుగుట్టలో ఏడాది నుంచి వాటి జాడే లేదు. 

హైదరాబాద్ లోని జూ పార్కులో 14 రాబందులు ఉన్నా అవన్నీ వృద్ధాప్యాన్ని 30-35యేళ్లకి చేరాయి. సంతానోత్పత్తి వయసు (20-25యేళ్లు) దాటి పోవడంతో వాటి సంతతి పెరగడం లేదు. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర నుంచి తీసుకువచ్చే రాబందులుతో సంతానోత్పత్తి పెంచాలన్న లక్ష్యం. 

జూ పార్కులో రాబందుల సంఖ్య 50కి చేరాక.. కొన్నింటిని తీసుకెళ్లి ఆసిఫాబాద్ అటవీ ప్రాంతాల్లో వదిలిపెడతామని అటవీశాఖ అధికారి ఒకరు తెలిపారు. 

Follow Us:
Download App:
  • android
  • ios