నేడు, రేపు అంటూ ప్రమోషన్ ఇవ్వకుండా తాత్సరం చేస్తున్నారంటూ తెలంగాణ సెక్రటేరియట్ ఉద్యోగులు సీఎస్ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. 

ప్రమోషన్స్ కోసం సీఎస్ ఛాంబర్ ముందు తెలంగాణ సెక్రటేరియట్ ఉద్యోగులు గురువారం ఆందోళనకు దిగారు. రాష్ట్రమంతా ప్రమోషన్స్ ఇచ్చారని.. ఎందుకు ఆపుతున్నారని ఉద్యోగులు నిరసన తెలిపారు. ఇప్పుడు అప్పుడు అంటూ కాలయాపన చేస్తున్నారని ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. ఈ నెల 31తో ప్యానెల్ ఇయర్ ముగుస్తుందని.. ప్రమోషన్ ఇవ్వాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఉద్యోగులను పిలిచి మాట్లాడుతున్నారు అధికారులు. ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred