హైదరాబాద్: డిసెంబర్ మొదటి వారంలో జీహెచ్ఎంసీ ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం కసరత్తు చేస్తోందని సమాచారం. ఈ విషయమై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.

జీహెచ్ఎంసీ ఎన్నికల నిర్వహణ విషయమై రాష్ట్ర ఎన్నికల సంఘం గురువారం నాడు పలు రాజకీయపార్టీలతో ఎస్ఈసీ సమావేశమైంది. 

ఈ సమావేశంలో జీహెచ్ఎంసీ ఎన్నికల నిర్వహణ విషయమై రాజకీయ పార్టీలతో ఎన్నికల సంఘం చర్చించింది.  దీపావళి తర్వాత జీహెచ్ఎంసీ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.ఈ విషయమై ఎస్ఈసీ రాజకీయ పార్టీల అభిప్రాయాన్ని తెలుసుకొంది. 

 

జీహెచ్ఎంసీ ఎన్నికల నిర్వహణ విషయమై ఈ నెల 13వ తేదీన రాష్ట్ర ఎన్నికల సంఘం  ఓటరు లిస్టును విడుదల చేయనుంది. రాజకీయ పార్టీలన్నీ ఓటరు జాబితాలో తప్పులపై ఎస్ఈసీకి ఫిర్యాదు చేశాయి. గతంలో చోటు చేసుకొన్న అవకతవకలను రాజకీయపార్టీలు ఎస్ఈసీ దృష్టికి తీసుకొచ్చాయి.

ఒక్కో రాజకీయ పార్టీకి 15 నిమిషాల పాటు రాష్ట్ర ఎన్నికల సంఘం సమయాన్ని కేటాయించింది. ఎన్నికల నిర్వహణ విషయమై రాజకీయ పార్టీలతో ఎన్నికల సంఘం చర్చించింది.

ఓటరు జాబితాలో పెద్ద ఎత్తున తప్పులు చోటు చేసుకొన్నాయని బీజేపీ ఆరోపించింది.  స్థానిక నాయకులతో కలిసి అధికారులు ఓట్లను తొలగించారని బీజేపీ  నేత రామచంద్రారెడ్డి ఆరోపించారు.  ఓట్లను తొలగించిన డివిజన్ల వివరాలను ఆయన వివరించారు.

అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఉన్న ఓటర్ జాబితా ఆధారంగా ఎన్నికలు నిర్వహించాలని గతంలో కోర్టు ఇచ్చిన తీర్పును ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు. సీపీఐ పోలింగ్ కు ఐదు రోజుల ముందు మద్యం షాపులను మూసివేయాలని సీపీఐ డిమాండ్ చేసింది. 

అభ్యర్ధి ఎన్నికల ఖర్చు రూ. 5 లక్షలకు మించి పెంచొద్దని సీపీఐ సూచించింది.