మందు తాగితే నష్టపోతారని పెద్దలు పదే పదే చెబుతుంటారు. కానీ పిల్లలు వినరు. ఆల్కహాల్ ఆరోగ్యాన్ని పాడు చేస్తుందని డాక్టర్లు చెబుతారు. కానీ కొందరు డాక్టర్లు కూడా మందు లేనిదే నిద్రపోరు. మరి మందు తాగితే ఆరోగ్యానికి హానికరమా కాదా అన్న చర్చ ఎప్పటినుంచో సాగుతూనే ఉన్నది. వేల ఏళ్ల నుంచి మందు.. ఆరోగ్యం అనే అంశంపై చర్చలు సాగుతున్నాయి.

తాజాగా డిసెంబరు 31వ తేదీన ఉదయం ‘‘మీరు మద్యం సేవించి వాహనాలు నడపొద్దు.. మద్యం అతిగా తాగి డ్రైవ్ చేసి వేరేవాళ్లకు హాని తలపెట్టొద్దు అని యాంకర్ ప్రదీప్ బుద్ధులు చెప్పిండు. రాత్రి కాంగనే మామా దస్ పెగ్ లా అని అమ్మాయిలతో కలిసి పూటుగా మందు కొట్టిండు. తీరా పోలీసులకు దొరకకుండా హడావిడి చేసిండు. తర్వాత నేను తప్పు చేశాను. నాలాగ ఎవరూ తప్పు చేయొద్దని డైలాగ్ కొట్టిండు. ఇదంతా మందు... ఆరోగ్యం లో భాగమే.

ఇది ఇలా ఉంచితే.. మందు తాగితే ఏం లాభాలున్నాయో.. తాగకపోతే ఏం నష్టాలున్నాయో.. వివరిస్తూ ఒగ్గు కళాకారులు కరీంనగర్ లో చేసిన గానం సోషల్ మీడియాకు ఎక్కింది. వాట్సాప్, ఫేస్ బుక్ లలో దుమ్మురేగిపోతున్నది. మరి ఈ పాట విని.. మందు తాగితే లాభాలో.. నష్టాలో మీరే తేల్చుకోండి..


గమనిక.. మద్యపానం ఆరోగ్యానికి హానికరం.