తెలంగాణ గ్రామీణాభివృద్ధి శాఖకు అవార్డుల పంట

https://static.asianetnews.com/images/authors/3800b66b-dc46-549b-a35e-91a1dbfb7895.jpg
First Published 11, Sep 2018, 6:46 PM IST
telangana rural development ministry taken 7 awards
Highlights

కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ ప్రతి ఏటా అందించే అవార్డుల్లో తెలంగాణ గ్రామీణాభివృద్ది శాఖకు అవార్డుల పంట పండింది. వివిధ కేటగిరీల్లో అందించే    ప్రతిష్టాత్మక అవార్డుల్లో తెలంగాణ రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖకు ఏడు 7 అవార్డులు లభించాయి. 

కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ ప్రతి ఏటా అందించే అవార్డుల్లో తెలంగాణ గ్రామీణాభివృద్ది శాఖకు అవార్డుల పంట పండింది. వివిధ కేటగిరీల్లో అందించే  ప్రతిష్టాత్మక అవార్డుల్లో తెలంగాణ రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖకు ఏడు 7 అవార్డులు లభించాయి. 

మంగళవారం దేశ రాజధాని  న్యూఢిల్లీ విజ్ఞాన్ భవన్  ప్లీనరీ హాల్లో ఈ జాతీయ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖా మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ చేతుల మీదుగా తెలంగాణ రాష్ట్రం గ్రామీణాభివృద్ధి శాఖ కమీషనర్  నీతూ ప్రసాద్ ఆద్వర్యంలో సంబందిత శాఖల అధికారులు కలిసి ఈ అవార్డులను అందుకున్నారు.

1.“పారదర్శకత మరియు జవాబుదారీతనం” కేటగిరి కింద అందించిన మూడు అవార్డులలో తెలంగాణ రాష్ట్రానికి ప్రథమ స్థానం లభించింది. దీనిని నీతూ ప్రసాద్,  బి. సైదులు అందుకున్నారు. 

2. ఉపాధి హామీ అమలు పథకం, సుపరిపాలన కార్యక్రమాల విభాగములో ద్వితీయ స్థానం లభించింది. ఈ అవార్డును నీతూ ప్రసాద్, బి. సైదులు అందుకొన్నారు.

3. శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ రూర్బన్ మిషన్ అమలులో అత్యుత్తమ పురస్కారం క్రింద దేశంలో ఎంపికైన 2 రాష్ట్రాలలో ఒక రాష్ట్రముగా తెలంగాణ నిలిచినది. దీనిని  నీతూ ప్రసాద్, ఎస్.జే ఆశ లు  అందుకున్నారు.

4. ఉపాధి హామీ అమలులో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన జిల్లాల విభాగంలో  దేశ స్థాయిలో 18 అవార్డులను ప్రధానం చేయగా అందులో తెలంగాణ రాష్ట్రానికి రెండు అవార్డులు దక్కాయి. అవి వికారాబాద్ జిల్లా నుండి సయ్యద్ ఒమర్ జలీల్,  పి.డబ్ల్యూ.జాన్సన్( డిఆర్డి‌ఓ) అందుకున్నారు.

 కామరెడ్డి జిల్లా తరపున జిల్లా కలెక్టర్ సత్యనారాయణ రెడ్డి, చంద్ర మోహన్ రెడ్డి( డిఆర్డి‌ఓ) కేంద్ర మంత్రి నరేంద్ర సింగ్ తోమార్ చేతుల మీదగా అవార్డులను అందుకున్నారు.

5. స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ (ఎస్‌ఐ‌ఆర్‌డి) గ్రామీణ జిల్లాలలో సమర్థవంతంగా పని చేసి శిక్షణ అమలు చేసినందులకు గాను ఈ అవార్డు లభించింది. ఈ అవార్డును పౌసుమీ బసు (కమీషనర్ ఎస్‌ఐ‌ఆర్‌డి)  అందుకున్నారు.
 


6. ఉపాధి హామీ అమలులో ఉత్తమ ప్రతిభ కనబర్చిన గ్రామ పంచాయతీ లలో 18 గ్రామ పంచాయితీలకు దేశ స్థాయిలో అవార్డులను ప్రధానం చేశారు. అందులో ఇబ్రహీంపూర్ గ్రామ పంచాయతీ, సిద్దిపేట్ జిల్లాకు అవార్డు దక్కింది. ఈ అవార్డును ఆ గ్రామ పంచాయతీ లో క్షేత్ర సహాయకుడు, ఆర్.రాజు, పంచాయతీ సెక్రటరీ ఎం.జీవన్ రెడ్డి,  కే.సమ్మి రెడ్డి (ఎంపిడిఓ) లు అందుకున్నారు.

7. ఉపాధి హామీ కూలీలకు సకాలంలో నగదు చెల్లింపులు చేసిన విభాగంలో 18 అవార్డులను ప్రధానం చేశారు. అందులో శాప మానయ్య బిపిఎం మక్త లక్ష్మాపూర్, శంకరంపేట ఎస్ఓ మెదక్ జిల్లా అందుకున్నారు.

ఈ అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ఉపాధి స్టేట్ ప్రోగ్రాం మేనేజర్లు దుర్గా ప్రసాద్, శేషు కుమార్, మురళీధర్, లెంకలపల్లి కృష్ణ మూర్తి మరియు జిల్లాల నుండి ల నర్సింగ రావు ఏపిఓ, రూర్బన్ నుంచి శేఖర్, నర్సింహులు తదితరులు హాజరయ్యారు. 

 
 
 

loader