తెలంగాణ ఆర్టీసి ముక్క చెక్కలు ?

telangana rtc divide into 4 corporations
Highlights

సర్కారు కసరత్తు

తెలంగాణ ఆర్టీసిని నాలుగు ముక్కలుగా చీల్చేందుకు తెలంగాణ సర్కారు కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. నష్టాల్లో ఉన్న ఆర్టీసిని లాభాల బాట పట్టించేందుకే నాలుగు కార్పొరేషన్లు గా ఆర్టీసిని విభజించాలని సర్కారు యోచిస్తోందని కార్మికులు అంటున్నారు.

గ్రేటర్ హైదరాబాద్ జోన్ ను కార్పొరేషన్ చేయనుందని, రంగారెడ్డి, మెదక్, మహబూబాబాద్ జోన్లలో మరో కార్పొరేషన్ ఏర్పాటు చేయనున్నట్లు చెబుతున్నారు. అలాగే ఖమ్మం, నల్లగొండ, వరంగల్ లో ఒక కార్పొరేషన్, ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ లలో మరో కార్పొరేషన్ ఏర్పాటు కానుంది.

ఆర్టీసిని ఇలాగే వదిలేస్తే.. మూతపడే అవకాశముందని, అందుకే నాలుగు గా విభజించి బాగు చేయాలన్న ధోరణితో సర్కారు ఉన్నట్లు చెబుతున్నారు. ఈమేరకు కార్మిక సంఘం నేతలతో ప్రగతిభవన్ లో చర్చలు జరగనున్నాయి.  

విభజన విషయమై త్వరలోనే మార్గదర్శకాలు విడుదల చేసి కార్పొరేషన్లుగా చేయనున్నట్లు చెబుతున్నారు. అయితే కార్మికులు దీన్ని ఏమేరకు రిసీవ్ చేసుకుంటారన్నది తేలాలి.

loader