Asianet News TeluguAsianet News Telugu

ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాతోపాటు తెలంగాణ వాసి

ఢిల్లీ ప్రభుత్వం గత నెలలో రద్దు చేసిన ఎక్సైజ్ పాలసీలో అవినీతి చోటుచేసుకున్నదనే ఆరోపణలతో సీబీఐ దర్యాప్తు చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా, సీబీఐ దాఖలు చేసిన ఎఫ్ఐఆర్ కాపీ బయటకు వచ్చింది. ఇందులో తొలి పేరు ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాగా ఉండగా.. ఈ జాబితాలో తెలంగాణ వాసి కూడా ఉన్నారు. 
 

telangana resident in delhi liquor policy case along with manish sisodia
Author
First Published Aug 19, 2022, 6:42 PM IST

న్యూఢిల్లీ: ఈ రోజు ఉదయం నుంచి ఢిల్లీ లిక్కర్ పాలసీ విషయమై దేశమంతా చర్చ జరుగుతున్నది. ఢిల్లీ ఎన్సీఆర్‌లో సుమారు 20 లొకేషన్‌లలో సీబీఐ తనిఖీలు చేసింది. ఓ బృందం ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా నివాసంలోనూ తనిఖీలు చేసింది. తాజాగా, సీబీఐ కేసులోని నిందితుల వివరాలు బయటకు వచ్చాయి. సీబీఐ దాఖలు చేసిన ఎఫ్ఐఆర్‌ను ఎన్‌డీటీవీ యాక్సెస్ చేసింది. ఇందులో ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా సహా తెలంగాణ వాసి కూడా ఉండటం గమనార్హం.

సీబీఐ ఎఫ్ఐఆర్‌లో మొత్తం 15 మంది పేర్లను పేర్కొంది. వీరితోపాటు ఇతరులూ అని చేర్చింది. దీంతో నిందితుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నది. తొమ్మిది నెలలపాటు అమలు చేసిన ఢిల్లీ ఎక్సైజ్ పాలసీలో అవినీతి చోటుచేసుకున్నదనేది ప్రధాన ఆరోపణగా ఉన్నది. ఈ పాలసీ గత నెలనే రద్దు చేశారు. 11 పేజీల ఆ ఎఫ్ఐఆర్ కాపీలో నేరపూరిత కుట్ర, ఫాల్సిఫికేషన్‌లు ప్రధాన ఆరోపణలుగా సీబీఐ చేర్చింది.

ఈ ఎక్సైజ్ పాలసీ అమలు కాలంలో బాధ్యులుగా ఉన్నవారిని ఎఫ్ఐఆర్‌లో చేర్చింది. అందులో తొలి పేరు ఢిల్లీ ఎక్సైజ్ మినిస్టర్ మనీష్ సిసోడియా పేరు ఉన్నది. అప్పటి ఎక్సైజ్ కమిషనర్ అర్వ గోపీ కృష్ణ రెండో పేరుగా ఉన్నది. కాగా, ఈ జాబితాలో తెలంగాణ వాసి పేరు కూడా ఉన్నది. 14వ పేరుగా అరుణ్ రామచంద్ర పిళ్లై పేరును సీబీఐ పేర్కొంది. ఈయన శాశ్వత నివాసం తెలంగాణలోని కోకాపేట్‌ ఈడెన్ గార్డెన్స్ సుశీ రియాల్టీగా తెలిపింది. అయితే, తాత్కాలిక నివాసంగా కర్ణాటకలోని బెంగళూరుగా పేర్కొంది.

Follow Us:
Download App:
  • android
  • ios