హైదరాబాద్:  తెలంగాణ రాష్ట్రంలో గత 24 గంటల్లో 5892 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో 4,81, 640కి చేరుకొన్నాయి.  కరోనాతో గత 24 గంటల్లో 46 మంది మరణించారు. కరోనాతో మరణించిన వారి సంఖ్య 2,625కి చేరుకొంది. .రాష్ట్రంలో 73,851 యాక్టివ్ కేసులున్నాయి. గత 24 గంటల వ్యవధిలో 70,961 మందికి పరీక్షలు నిర్వహించినట్టుగా వైద్య శాఖ తెలిపింది. ఇంకా 3,854 మంది పరీక్షల రిపోర్టు ఇంకా రావాల్సి ఉంది.

గత 24 గంటల వ్యవధిలో ఆదిలాబాద్ లో074, భద్రాద్రి కొత్తగూడెంలో 097, జీహెచ్ఎంసీ పరిధిలో 1104, జగిత్యాలలో143,జనగామలో 053, జయశంకర్ భూపాలపల్లిలో 59, గద్వాలలో 86,కామారెడ్డిలో 066, కరీంనగర్ లో 263,ఖమ్మంలో188, మహబూబ్‌నగర్లో 195, ఆసిఫాబాద్ లో 051, మహబూబాబాద్ లో129, మంచిర్యాలలో 143,మెదక్ లో99 కేసులు నమోదయ్యాయి.

మల్కాజిగిరిలో376,ములుగులో035,నాగర్ కర్నూల్ లో 204,నల్గగొండలో323, నారాయణపేటలో058, నిర్మల్ లో 039, నిజామాబాద్ లో139,పెద్దపల్లిలో137,సిరిసిల్లలో097,రంగారెడ్డిలో443, సిద్దిపేటలో 201సంగారెడ్డిలో193,సూర్యాపేటలో089, వికారాబాద్ లో 148, వనపర్తిలో113, వరంగల్ రూరల్ లో 100,వరంగల్ అర్బన్ 321 యాదాద్రి భువనగిరిలో 126 కేసులు నమోదయ్యాయి.