24 గంటల్లో తెలంగాణలో రికార్డు: మొత్తం కరోనా కేసులు 3496కి చేరిక
తెలంగాణ రాష్ట్రంలో కరోనా విజృంభిస్తోంది. 24 గంటల వ్యవధిలో రికార్డు స్థాయిలో 206 కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు ఇంత పెద్ద సంఖ్యలో ఎప్పుడూ కూడ రాష్ట్రంలో కరోనా కేసులు నమోదు కాలేదు. దీంతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 3,496కి చేరుకొన్నాయి.
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో కరోనా విజృంభిస్తోంది. 24 గంటల వ్యవధిలో రికార్డు స్థాయిలో 206 కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు ఇంత పెద్ద సంఖ్యలో ఎప్పుడూ కూడ రాష్ట్రంలో కరోనా కేసులు నమోదు కాలేదు. దీంతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 3,496కి చేరుకొన్నాయి.
also read:ఒకే రోజు 8 మరణాలు, 143 కేసులు: తెలంగాణపై కరోనా పంజా, 3,290 కి చేరిన సంఖ్య
తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. 24 గంటల వ్యవధిలో 206 కేసులు నమోదు కావడం రికార్డు. జీహెచ్ఎంసీ పరిధిలో అత్యధికంగా 152 కేసులు నమోదయ్యాయి.
రంగారెడ్డిలో 10, మేడ్చల్ లో 18, నిర్మల్ లో 5, యాదాద్రిలో 5, మహబూబ్ నగర్ లో 4, మహబూబాబాద్ లో 1, జగిత్యాలలో 2, వికారాబాద్ , జనగామ,గద్వాల,నల్గొండ, భద్రాద్రి, కరీంనగర్, మంచిర్యాలలో ఒక్క కేసు, నాగర్ కర్నూల్ జిల్లాలో రెండు కేసులు నమోదయ్యాయి.
ఇప్పటివరకు కరోనా నుండి కోలుకొని 1710 మంది రోగులు ఆసుపత్రుల నుండి డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటివరకు కరోనాతో రాష్ట్రంలో 123 మంది మరణించారు. 163 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారని ప్రభుత్వం ప్రకటించింది.24 గంటల వ్యవధిలో రాష్ట్రంలో 10 మంది కరోనాతో మరణించారు.
విదేశాల నుండి వచ్చినవారు, వలస కూలీలకు 448 మందికి కరోనా వచ్చింది. తెలంగాణ రాష్ట్రంలోని 3048 మందికి కరోనా సోకినట్టుగా ప్రభుత్వం ప్రకటించింది.