Asianet News TeluguAsianet News Telugu

తెలంగాణలో పెరుగుతున్న కోవిడ్: 24 గంటల్లో 1963 కరోనా కేసులు

తెలంగాణ రాష్ట్రంలో గత 24 గంటల్లో1963 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో  7,07,162 కరోనా కేసులు చేరాయి. కరోనా కేసుల వ్యాప్తిని అరికట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది.

Telangana Reports 1963 new corona  cases, total rises to 7,07,162
Author
Hyderabad, First Published Jan 15, 2022, 8:47 PM IST

హైదరాబాద్:Telangana రాష్ట్రంలో Corona కేసులు పెరిగిపోతున్నాయి. గత 24 గంటల్లో 1963 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి.దీంతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 7,07,162కి చేరుకొన్నాయి.గత 24 గంటల్లో కరోనాతో ముగ్గురు మరణించారు

.రాష్ట్రంలో కరోనాతో మరణించిన వారి సంఖ్య 4,054కి చేరుకొంది. తెలంగాణ రాష్ట్రంలో కరోనా నుండి నిన్న 1620 మంది కోలుకొన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 22,017 యాక్టివ్ కరోనా కేసులున్నాయి. Ghmc పరిధిలో ఇవాళ 1075 కరోనా కేసులు నమోదయ్యాయి.

మరోవైపు దేశంలో మళ్లీ కరోనా పడగ విప్పుతోంది. రోజురోజుకూ కరోనా విజృంభిస్తుంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 2,68,833 కేసులు నమోదయ్యాయి. అదే స‌మ‌యంలో  1,22,684 మంది కోలుకున్నారు. ప్రస్తుతం 14 లక్ష17 వేల 820 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. దీంతో దేశంలో కోవిడ్ పాజిటివ్ రేటు 16.66 శాతానికి చేరింది. 
అదే స‌మయంలో కోవిడ్‌తో 402 మంది ప్రాణాలు కోల్పోయారు.

దీంతో మొత్తంగా ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 4.85 లక్షల చేరింది. మహారాష్ట్రలో అత్య‌ధికంగా 43 వేల 211 కేసులు నమోదు అయ్యాయి.కర్ణాటకలో 28,723 కేసులు,ఢిల్లీలో 24,383 కేసులు, తమిళనాడులో 23,459 కేసులు, పశ్చిమ బెంగాల్‌లో 22,645 కేసులు నమోదయ్యాయి.ఉత్త‌ర‌ప్ర‌దేశ్, కేరళల్లో 16 వేలకు పైగా కేసులు రికార్డయ్యాయి. అలాగే రాజస్థాన్‌లో కొత్తగా 10,307 కేసులు వెలుగులోకి వ‌చ్చాయి. బీహార్‌లో 6,500, ఏపీలో 4,528, మధ్యప్రదేశ్‌లో 4,755,  చండీగఢ్‌లో 1,834 కేసులు వెలుగులోకి వ‌చ్చాయి. 

దేశ వ్యాప్తంగా  వ్యాక్సినేషన్‌ ప్రక్రియ ముమ్మరంగా సాగుతుంది.  నిన్నఒక్క రోజే 57.37 లక్షల మంది కరోనా టీకా తీసుకున్నారు. అదేవిధంగా 3.92 లక్షల మంది బూస్ట‌ర్ డోసుల‌ను తీసుకున్నారు. అలాగే ఇప్ప‌టి వ‌ర‌కూ మొత్తం 156 కోట్లకు పైగా టీకా డోసులు పంపిణీ చేసిన‌ట్టు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.  

క‌రోనా క‌ట్ట‌డి చ‌ర్య‌లకు ఢిల్లీ స‌ర్కారు చర్యలను చేపట్టింది.  కొన్ని రోజులుగా డిల్లీలో కరోనా వైర‌స్ బారిన‌పడుతున్నారు.క‌రోనా వైర‌స్ మ‌హ‌మ్మారి కార‌ణంగా ప్రాణాలు కోల్పోయిన వారిలో  దాదాపు 75శాతం మంది కోవిడ్ టీకాలు తీసుకోనివారే ఉన్నార‌ని ఢిల్లీ ఆరోగ్యశాఖ మంత్రి సత్యేందర్‌ జైన్‌ అన్నారు. జనవరి 9నుంచి 12 వరకు 97మంది  క‌రోనా వైర‌స్ కార‌ణంగా చ‌నిపోయార‌ని ఆయన చెప్పారు..  వారిలో 70మంది టీకాలు తీసుకోనివారున్నారని చెప్పారు...

19మంది కేవలం తొలిడోసు మాత్రమే తీసుకున్నారని చెప్పారు. వీరిలో 8మంది మాత్రమే రెండు డోసుల క‌రోనా  టీకాలు తీసుకున్నార‌ని తెలిపారు. క‌రోనా విజృంభిస్తున్న నేప‌థ్యంలో వైర‌స్ నుంచి ర‌క్ష‌ణ పొంద‌గారికి టీకాలు అత్యంత కీల‌క‌మ‌నీ, అంద‌రూ వ్యాక్సిన్లు తీసుకోవాల‌ని ప్ర‌జ‌ల‌ను కోరారు.  ఢిల్లీ ఆస్పత్రుల్లో ప్రస్తుతం 13వేలకు పైగా బెడ్స్ ఖాళీగా ఉన్నాయ‌ని తెలిపారు. 

 ఢిల్లీలో కొత్త‌గా 24,383 మంది క‌రోనా   బారిన‌ప‌డ్డారు. దీంతో అక్క‌డ మొత్తం కేసులు 16,70,966కు చేరాయి. అలాగే, 34 మంది వైర‌స్ తో పోరాడుతూ ప్రాణాలు కోల్పోయారు.ఢిల్లీలో మొత్తం క‌రోనా వైర‌స్ కార‌ణండా చ‌నిపోయిన వారి సంఖ్య 25,305కు పెరిగింది. ప్ర‌స్తుతం 92,273 యాక్టివ్ కేసులు ఉన్నాయి. 

Follow Us:
Download App:
  • android
  • ios