24 గంటల్లో 11 మంది మృతి: తెలంగాణలో కరోనా కేసులు 25,733కి చేరిక
తెలంగాణ రాష్ట్రంలో 24 గంటల్లో 1831 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసులు 25,733కి చేరుకొన్నాయి.
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో 24 గంటల్లో 1831 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసులు 25,733కి చేరుకొన్నాయి.
రాష్ట్రంలో ఇప్పటివరకు 1,22, 218 శాంపిల్స్ ను పరీక్షించారు. ఈ రోజు 6383 మంది శాంపిల్స్ పరీక్షించినట్టుగా తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది.
తెలంగాణ రాష్ట్రంలో యాక్టివ్ కేసులు 10,646 ఉన్నాయి. 24 గంటల్లో కరోనాతో 11 మంది మరణించారు.
also read:తెలంగాణలో 23 వేలు దాటిన కరోనా: కొత్తగా 1,590 కేసులు, ఏడుగురు మృతి
రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనాతో మరణించిన వారి సంఖ్య 306కి చేరుకొంది.24 గంటల్లో 1831 కేసులు నమోదైతే జీహెచ్ఎంసీ పరిధిలో 1,419 కేసులు నమోదైనట్టుగా తెలంగాణ ప్రభుత్వం తెలిపింది.
రంగారెడ్డి జిల్లాలో 160, మేడ్చల్ లో 117, సంగారెడ్డిలో 3, కరీంనగర్‌లో5, మహబూబ్ నగర్ లో9, గద్వాల్ లో 1, నల్గొండ, వరంగల్ అర్బన్,నిజామాబాద్, పెద్దపల్లి జిల్లాల్లో 9 చొప్పున కేసులు నమోదయ్యాయి.
వికారాబాద్ లో7, మెదక్ లో 20, నారాయణపేట, యాదాద్రి భువనగిరి, మహబూబాబాద్ జిల్లాల్లో 1 చొప్పున కేసులు రికార్డయ్యాయి. సూర్యాపేటలో 6, మంచిర్యాలలో 20, ఖమ్మంలో 21, జగిత్యాలలో 4 కేసులు నమోదైనట్టుగా తెలంగాణ ప్రభుత్వం తెలిపింది.తెలంగాణ రాష్ట్రంలో కరోనా నుండి 14,781 మంది కోలుకొన్నట్టుగా ప్రభుత్వం ప్రకటించింది.