తెలంగాణలో కరోనా కేసులు గణనీయంగా తగ్గాయి. గత 24 గంటల్లో  1197 కరోనా కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో 1,19,537 మంది శాంపిల్స్ పరీక్షిస్తే   1197 కరోనా కేసులు రికార్డయ్యాయి.  కరోనాతో 24 గంటల్లో 9 మంది మరణించారు. 


హైదరాబాద్: తెలంగాణలో కరోనా కేసులు గణనీయంగా తగ్గాయి. గత 24 గంటల్లో 1197 కరోనా కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో 1,19,537 మంది శాంపిల్స్ పరీక్షిస్తే 1197 కరోనా కేసులు రికార్డయ్యాయి. కరోనాతో 24 గంటల్లో 9 మంది మరణించారు.

ఈ నెల 20వ తేదీ నుండి రాష్ట్రంలో లాక్‌డౌన్ ను తెలంగాణ ప్రభుత్వం ఎత్తివేసింది. మే 12వ తేదీ నుండి రాష్ట్రంలో లాక్‌డౌన్ అమలు చేశారు. మే 12 నుండి జూన్ 20వ తేదీ వరకు లాక్‌డౌన్ కొనసాగింది. లాక్‌డౌన్ కారణంగా కరోనా కేసులు గణనీయంగా తగ్గాయని వైద్య ఆరోగ్యశాఖ నివేదికలు వెల్లడిస్తున్నాయి. 

తెలంగాణాలో ఇప్పటివరకు కరోనా సోకిన వారి సంఖ్య 6,14,399కి చేరుకొంది. కరోనాతో మరణించిన వారి సంఖ్య 3,576కి పెరిగింది. నిన్న ఒక్క రోజులోనే కరోనా నుండి 1,709 మంది కోలుకొన్నారు. కరోనా నుండి కోలుకొన్న వారి సంఖ్య 5,93,577కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా యాక్టివ్ కేసులు 17, 246కి గా నమోదైనట్టుగా తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది.