Hyderabad: మాతాశిశు మరణాల రేటు తక్కువగా ఉన్న దేశంలోని టాప్ మూడు రాష్ట్రాల్లో తెలంగాణ ఒక‌టిగా ఉంద‌ని రాష్ట్ర ఆరోగ్య మంత్రి హ‌రీశ్ రావు తెలిపారు. ప్రస్తుతం ఈ ర్యాంకింగ్స్ లో 43 ఎంఎంఆర్ తో తెలంగాణ మూడో స్థానంలో ఉండగా, మొదటి రెండు స్థానాల్లో వరుసగా 19, 33 ఎంఎంఆర్ తో కేరళ, మహారాష్ట్రలు  ఉన్నాయి. 

Telangana Health Minister T Harish Rao: రాష్ట్రంలో ఆరోగ్య రంగానికి బీఆర్ఎస్ ప్రభుత్వం అధిక ప్రాధాన్య‌త‌ను ఇస్తున్న‌ద‌ని తెలంగాణ ఆరోగ్య మంత్రి త‌న్నీరు హ‌రీశ్ రావు అన్నారు. మాతాశిశు మరణాల రేటు తక్కువగా ఉన్న టాప్ మూడు భారతీయ రాష్ట్రాల్లో తెలంగాణ ఒక‌టిగా ఉంద‌ని తెలిపారు. ప్రస్తుతం ఈ ర్యాంకింగ్స్ లో 43 ఎంఎంఆర్ తో తెలంగాణ మూడో స్థానంలో ఉండగా, మొదటి రెండు స్థానాల్లో వరుసగా 19, 33 ఎంఎంఆర్ తో కేరళ, మహారాష్ట్ర ఉన్నాయి.

వివ‌రాల్లోకెళ్తే.. ప్రభుత్వ ఆసుపత్రుల్లో మాతాశిశు మరణాలను పరిష్కరించడానికి ఉద్దేశించిన చర్యలు అతి తక్కువ మాతాశిశు మరణాల రేటు (ఎంఎంఆర్) ఉన్న మొదటి మూడు భారతీయ రాష్ట్రాలలో తెలంగాణను ఒక‌టిగా నిల‌బెట్టాయ‌ని మంత్రి హ‌రీశ్ రావు తెలిపారు. గర్భిణులకు వైద్యసేవలు అందించే విధానంలో లోపాలను సరిదిద్దేందుకు కృషి చేస్తామని మంత్రి హరీశ్ రావు తెలిపారు. దీని కోసం కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు అందరూ ఆరోగ్య సిబ్బంది కలిసికట్టుగా పనిచేయాలని అన్నారు. పేట్లబుర్జ్ ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రిలో 'ఇన్ఫెక్షన్ ప్రివెన్షన్, ఎర్లీ డిటెక్షన్ అండ్ మేనేజ్మెంట్ ప్రోగ్రాం' అనే అంశంపై సీఎంఈని ప్రారంభించిన సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గత కొన్నేళ్లుగా మాతాశిశు ఆరోగ్యం (ఎంసీహెచ్) లక్ష్యంగా చేపట్టిన చర్యలను వివరించారు.

"మరికొద్ది నెలల్లో గాంధీ ఆస్పత్రిలో 250 పడకల ఎంసీహెచ్ కేంద్రాన్ని, నిమ్స్ ఆస్పత్రిలో మరో 200 పడకల సౌకర్యాన్ని అందుబాటులోకి తెస్తాం. కేసీఆర్ కిట్స్, మిడ్వైఫరీ (Midwifery initiative), అమ్మఒడి పథకం, గర్భిణులకు పౌష్టికాహార కిట్లు వంటి కార్యక్రమాలు లక్ష ప్రసవాలకు ఎంఎంఆర్ ను 43కు తగ్గించడంలో పెద్ద పాత్ర పోషించాయని" మంత్రి హ‌రీశ్ రావు అన్నారు. సంస్థాగత ప్రసవాలు 30 శాతం నుంచి 61 శాతానికి పెరిగాయ‌ని తెలిపారు. రాబోయే వారాల్లో 1,400 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లను నియమిస్తామనీ, ఇది ప్రభుత్వ ఆసుపత్రుల్లో, ముఖ్యంగా ప్రసూతి ఆసుపత్రుల్లో ఆరోగ్య సేవల నాణ్యతను మరింత మెరుగుపరుస్తుందని మంత్రి చెప్పారు.

ప్రస్తుతం ఈ ర్యాంకింగ్స్ లో 43 ఎంఎంఆర్ ((MMR)) తో తెలంగాణ మూడో స్థానంలో ఉండగా, మొదటి రెండు స్థానాల్లో వరుసగా 19, 33 ఎంఎంఆర్ తో కేరళ, మహారాష్ట్ర ఉన్నాయి. మాతాశిశు మరణాలు తక్కువగా ఉన్న భారత్ లో నంబర్ వన్ రాష్ట్రంగా నిలవడమే తమ లక్ష్యమన్నారు. ఆరోగ్య సంరక్షణలో వ్యవస్థాగత లోపాలను మరింత సరిదిద్దాల్సిన అవసరం ఉందనీ, గిరిజన జనాభా గణనీయంగా ఉన్న మారుమూల ప్రాంతాలు, గ్రామీణ‌ ప్రాంతాల్లో ప్రసూతి సంరక్షణపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని మంత్రి హ‌రీశ్ రావు తెలిపారు. తెలంగాణలో మొత్తం 4 లక్షల మంది గర్భిణులకు కూడా ప్రత్యేక పౌష్టికాహార కిట్లు అందుతాయనీ, ప్రసూతి మరణాలను మరింత తగ్గించేందుకు ఆరోగ్య యంత్రాంగాన్ని మరింత విశ్లేషించాల్సిన అవసరం ఉందని కూడా పేర్కొన్నారు.

Scroll to load tweet…
Scroll to load tweet…