తెలంగాణ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావుకు కరోనా.. ఆసుపత్రిలో చేరిక
తెలంగాణ పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ (telangana public health director) డాక్టర్ శ్రీనివాసరావు (srinivasa rao) కరోనా (coronavirus) బారిన పడ్డారు. స్వల్ప లక్షణాలతో ఆసుపత్రిలో చేరుతున్నట్టు ఆయనన స్వయంగా వెల్లడించారు. కొవిడ్ నిర్ధారణ కావడంతో ముందు జాగ్రత్తగా ఐసోలేషన్, తగిన చికిత్స కోసం ఆసుపత్రిలో చేరుతున్నట్లు శ్రీనివాసరావు పేర్కొన్నారు
తెలంగాణ పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ (telangana public health director) డాక్టర్ శ్రీనివాసరావు (srinivasa rao) కరోనా (coronavirus) బారిన పడ్డారు. స్వల్ప లక్షణాలతో ఆసుపత్రిలో చేరుతున్నట్టు ఆయనన స్వయంగా వెల్లడించారు. కొవిడ్ నిర్ధారణ కావడంతో ముందు జాగ్రత్తగా ఐసోలేషన్, తగిన చికిత్స కోసం ఆసుపత్రిలో చేరుతున్నట్లు శ్రీనివాసరావు పేర్కొన్నారు. ఏ విధమైన ఆందోళనలు, అపోహలు వద్దని... త్వరలోనే పూర్తి ఆరోగ్యంతో మీ ముందుకు వస్తానని చెప్పారు. కరోనా పట్ల అప్రమత్తంగా ఉండాలని శ్రీనివాసరావు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
కాగా.. ఇటీవల కొవిడ్ వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో పలువురు వైద్యులు, ఆరోగ్య సిబ్బంది మహమ్మారి బారినపడుతున్నారు. గాంధీ ఆసుపత్రిలో దాదాపు 80 మందికి కొవిడ్ సోకగా.. ఆ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని సమాచారం. అలాగే ఉస్మానియా ఆసుపత్రిలోనూ దాదాపు 180 మంది వరకు వైద్యులు, సిబ్బంది కొవిడ్ బారిన పడినట్టు ఆసుపత్రి సూపరింటెండెంట్ తెలిపారు. నీలోఫర్ ఆసుపత్రిలోనూ 25 మందికి కొవిడ్ సోకినట్టు ఆసుపత్రి వర్గాలు స్పష్టం చేశాయి.
మరోవైపు భారత్‌లో గడిచిన 24 గంటల్లో భారత్‌లో కొత్తగా 2,38,018 కరోనా కేసుల నమోదయ్యాయి. అయితే గత రెండు రోజులుగా కరోనా కొత్త కేసుల సంఖ్య తగ్గడం కొద్దిగా ఊరట కలిగించే అంశమని చెప్పాలి. తాజాగా 310 కరోనాతో మంది మరణించారు. దీంతో కరోనాతో మొత్తం మరణాల సంఖ్య 4,86,761కి చేరింది. నిన్న కరోనా నుంచి 1,57,421 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటివరకు దేశంలో కరోనాను జయించిన వారి సంఖ్య 3,53,94,882 కి చేరింది. ప్రస్తుతం దేశంలో 17,36,628 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి.
దేశంలో కరోనా రోజువారి పాజిటివిటీ రేటు 14.43 శాతంగా ఉన్నట్టుగా కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. ప్రస్తుతం దేశంలో రికవరీ రేటు.. 94.09 శాతం, యాక్టివ్ కేసులు.. 4.62 శాతంగా ఉంది. ఇక, శనివారం (జనవరి 15) రోజున దేశంలో 16,49,143 శాంపిల్స్‌ను పరీక్షించినట్టుగా ఐసీఎంఆర్ వెల్లడించింది. దీంతో దేశంలో ఇప్పటివరకు పరీక్షించిన శాంపిల్స్ సంఖ్య 70,54,11,425కి చేరినట్టుగా తెలిపింది.
మరోవైపు దేశంలో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా కొనసాగుతుంది. నిన్న దేశంలో 79,91,230 డోసుల వ్యాక్సిన్ పంపిణీ జరిగింది. దీంతో ఇప్పటివరకు పంపిణీ చేసిన వ్యాక్సిన్ డోసుల సంఖ్య 1,58,04,41,770కి చేరింది. దేశంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య కూడా భారీగా పెరుగుతుంది. ఇప్పటివరకు దేశంలో 8,891 ఒమిక్రాన్ కేసులు నమోదైనట్టుగా కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. 29 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఒమిక్రాన్ కేసులు నమోదైనట్టుగా తెలిపింది.