తెలంగాణ ఎన్నికల్లో భాగంగా రేపు పోలింగ్ జరగనుంది. ఈ నేపథ్యంలో ఓటు హక్కు వినియోగించుకునేందుకు నగరజీవి స్వగ్రామాలకు బయలుదేరాడు. దీనికి తోడు వరుస సెలవులు రావడంతో పెద్ద మొత్తంలో జనం పల్లెబాట పట్టారు.

దీంతో జంటనగరాల్లోని రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు ప్రయాణీకులతో కిక్కిరిసిపోయాయి. సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ, లింగంపల్లి రైల్వే స్టేషన్లతో పాటు ఎంజీబీఎస్, జేబీఎస్‌ బస్టాండ్లలో పండుగ వాతావరణం నెలకొంది.

రద్దీ దృష్ట్యా ఆర్టీసీ యాజమాన్యం ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. రోజూ తిరిగే 3500 బస్సులకు తోడు మరో 1200 బస్సులను ఏర్పాటు చేసినట్లు ఆర్టీసీ అధికారులు ప్రకటించారు. అయితే బస్సుల కోసం నిరీక్షించాల్సి వస్తోందని.. ప్రత్యేక బస్సులు తమకు ఏ మూలకు సరిపోవడం లేదని జనం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

ఓటరు కార్డు లేకపోయినా.. ఈ 13 కార్డుల్లో ఏదైనా ఒకటి ఉంటే చాలు

మీ ఓటు, పోలింగ్ బూత్‌ ఎక్కడుందో తెలుసుకోండిలా..