Asianet News TeluguAsianet News Telugu

మీ ఓటు, పోలింగ్ బూత్‌ ఎక్కడుందో తెలుసుకోండిలా..

మరికొన్ని గంటల్లో తెలంగాణ ఎన్నికలు ప్రారంభంకానున్నాయి. ఇందుకు సంబంధించి ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు చేసింది. అయితే కొత్తగా ఓటర్లుగా నమోదు చేయించుకున్నవారితో పాటు పాత వారిలో చాలా మందికి తమ ఓటు ఎక్కడుందో..? ఏ పోలింగ్ బూత్‌లో ఓటు వేయాలో చాలా మందికి తెలియదు. 

how to find polling station number in telangana
Author
Hyderabad, First Published Dec 6, 2018, 7:28 PM IST

మరికొన్ని గంటల్లో తెలంగాణ ఎన్నికలు ప్రారంభంకానున్నాయి. ఇందుకు సంబంధించి ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు చేసింది. అయితే కొత్తగా ఓటర్లుగా నమోదు చేయించుకున్నవారితో పాటు పాత వారిలో చాలా మందికి తమ ఓటు ఎక్కడుందో..? ఏ పోలింగ్ బూత్‌లో ఓటు వేయాలో చాలా మందికి తెలియదు.

ఓటు హక్కు వినియోగించుకోవాలనుకునే చాలా మంది పోలింగ్ రోజు ఈ విషయాల్లో కన్‌ఫ్యూజ్ అవుతుంటారు. అలాంటి వారి కోసం ఎన్నికల సంఘం ‘నా ఓటు’ అనే యాప్‌ను అందుబాటులో తీసుకొచ్చింది. దీని ద్వారా ఓటరు సులభంగా తన ఓటు, పోలింగ్ బూత్ ఎక్కడుందో తెలుసుకోవచ్చు

నా ఓటు యాప్ ద్వారా:

* గూగుల్, యాపిల్ ప్లే స్టోర్ల నుంచి ‘నా ఓటు’ అనే యాప్ డౌన్‌లోడ్ చేసుకుని, ఇన్‌స్టాల్ చేసుకోవాలి.

* యాప్ ఓపెన్ చేసి దానిలో పేరు, తండ్రి పేరుతో పాటు ఇతర వివరాలు ఎంటర్ చేస్తే.. గుర్తింపు కార్డు, పోలింగ్ కేంద్రం వివరాలు డిస్‌ప్లే అవుతాయి.

* నియోజకవర్గం, అభ్యర్థుల సమాచారం ఆప్షన్‌ ద్వారా ఆ నియోజకవర్గంలో పోటీలో ఉన్న అభ్యర్థుల పేర్లు, పార్టీ పేర్లు తదితర వివరాలు తెలుస్తాయి.

* పికప్ సర్వీస్ అనే కాలమ్‌ను ప్రత్యేకంగా దివ్యాంగ ఓటర్ల కోసం అందుబాటులోకి తీసుకొచ్చారు.

* దివ్యాంగులు తమ ఎపిక్ సంఖ్యను నమోదు చేస్తే వీరిని పోలింగ్ కేంద్రానికి తీసుకెళ్లాలి అనే సందేశం స్థానికంగా ఉన్న బీఎల్‌వోకు వెళుతుంది.

* పీడబ్ల్యూడీ వాలంటీర్ల ఆప్షన్ ద్వారా తమ పోలింగ్ కేంద్రం పేరు టైప్ చేస్తే అక్కడి వాలంటీర్ నంబర్, ఫోన్ నెంబర్ వస్తుంది. వారికి ఫోన్ చేస్తే కేంద్రం వరకు తీసుకెళ్లి.. తిరిగి ఇంటి వద్ద దించుతారు.

* యాప్‌లో ఉన్న గూగుల్ మ్యాప్ ద్వారా పోలింగ్ కేంద్రం పేరు నమోదు చేస్తే జీపీఎస్ సాయంతో నేరుగా కేంద్రానికి చేరుకోవచ్చు.

* దీనితోపాటు దగ్గర్లోని పోలింగ్ కేంద్రం, పోలీస్ స్టేషన్, బస్టాండ్ ఎక్కడుందో తెలుసుకునేందుకు వీలుంది. 

 

ఆన్‌లైన్ ద్వారా:
గూగుల్‌లోకి వెళ్లి ‘‘ http://www.ceotelangana.nic.in/ ’’ టైప్ చేయాలి..

*  అక్కడ  ELECTORS SEARCHని క్లిక్ చేస్తే అందులో జిల్లాల పేర్లు వస్తాయి.. అందులో మీది ఏ జిల్లా అయితే ఆ జిల్లా పేరును క్లిక్ చేయాలి.

* ఆయా జిల్లాల్లోని నియోజకవర్గాలు డిస్ ప్లే అవుతాయి. మీది ఏ నియోజకవర్గమైతే దానిని క్లిక్ చేస్తే మీ పేరు, పోలింగ్ బూత్ నెంబర్లతో సహా కనిపిస్తాయి. 

* ఇంటి పేరు, తండ్రి పేరు ఆధారంగా ఓటును నిర్థారించుకోవాలి.. పేరు పక్కనే ఉండే పోలింగ్ బూత్ పేరు, నంబరు రాసుకుని నేరుగా ఆ పోలింగ్ కేంద్రానికి వెళ్లి ఓటు హక్కును వినియోగించుకోవచ్చు.

Follow Us:
Download App:
  • android
  • ios