Asianet News TeluguAsianet News Telugu

మైక్రో ఫైనాన్స్ యాప్స్: గూగుల్ ప్లే స్టోర్ నుండి తొలగించాలని గూగుల్‌కి పోలీసుల లేఖ

మైక్రో ఫైనాన్స్ యాప్స్ పై చర్యలు తీసుకోవాలని  హైద్రాబాద్ పోలీసులు మంగళవారం నాడు  గూగుల్ కు లేఖ రాశారు. గూగుల్ ప్లే స్టోర్ నుండి 63 యాప్స్ ను తొలగించాలని  హైద్రాబాద్ పోలీసులు గూగుల్ కు లేఖ రాశారు.

Telangana police writes letter to google for remove microfinance apps from google play store lns
Author
Hyderabad, First Published Dec 22, 2020, 5:30 PM IST


హైదరాబాద్: మైక్రో ఫైనాన్స్ యాప్స్ పై చర్యలు తీసుకోవాలని  హైద్రాబాద్ పోలీసులు మంగళవారం నాడు  గూగుల్ కు లేఖ రాశారు. గూగుల్ ప్లే స్టోర్ నుండి 63 యాప్స్ ను తొలగించాలని  హైద్రాబాద్ పోలీసులు గూగుల్ కు లేఖ రాశారు.

మైక్రో ఫైనాన్స్ యాప్స్ రుణాలిస్తున్నారు. ఈ రుణాలు తీసుకొన్నవారిని ఈ సంస్థల వేధింపులకు పలువురు గురయ్యారు. ఈ వేధింపులు భరించలేక కొందరు ఆత్మహత్యకు పాల్పడ్డారు.

also read:మైక్రో ఫైనాన్స్ యాప్స్: 'హైద్రాబాద్ లో 11 మంది అరెస్ట్'

ఈ విషయమై  పోలీసులకు అందిన ఫిర్యాదుల మేరకు  కేసులు నమోదయ్యాయి. సైబరాబాద్ పోలీసులు ఇప్పటికే నలుగురిని అరెస్ట్ చేశారు.హైద్రాబాద్ పోలీసులు 11 మంది అరెస్ట్ చేశారు. తెలంగాణలో కాల్ సెంటర్ కు చెందిన మధును పోలీసులు అరెస్ట్ చేశారు. 

గూగుల్ ప్లే స్టోర్ నుండి మైక్రో ఫైనాన్స్ సంస్థ యాప్స్ నుండి తొలగించాలని హైద్రాబాద్ పోలీసులు లేఖ రాశారు.  హైద్రాబాద్ సీసీఎస్ పోలీసులు గూగుల్ కు లేఖ రాశారు.


 

Follow Us:
Download App:
  • android
  • ios