దేశ వ్యాప్తంగా ఎక్కడ ఎన్నికలు జరిగినా ఓటర్లను ప్రలోభాలకు గురిచేసేలా డబ్బు, మద్యం ఏరులై పారుతుంటుంది. అలాగే ప్రస్తుతం జరుగుతున్న తెలంగాణ ఎన్నికల్లో మరీ దారుణంగా మద్యం పంపిణీ జరుగుతోందన్నది పోలీసులు వెల్లడించిన వివరాలను బట్టి తెలుస్తోంది. పోలీసులు చేపట్టిన తనిఖీల్లో ఇప్పటివరకు దాదాపు 4లక్షల లీటర్ల అక్రమ మద్యాన్ని సీజ్ చేసినట్లు అదనపు డిజి జితేందర్ రెడ్డి వెల్లడించారు. అయితే ఎన్నికలకు మరో రెండు రోజులు మిగిలివుండటంతో తనిఖీలు మరింత ముమ్మరం చేసినట్లు...అందువల్ల మరింత ఎక్కువగా అక్రమ మద్యం పట్టుబడే అవకాశం ఉందని వెల్లడించారు. 

2014 లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో 2.75 లీటర్ల మద్యాన్ని సీజ్ చేసినట్లు వెల్లడించారు. ఇలా గతంతో పోలిస్తే తాము సీజ్ చేసిన మద్యం ఇప్పటికే డబుల్ అయ్యిందన్నారు. 

 ఎన్నికల కోసం కేంద్ర బలగాలతో పాటు ఆరు రాష్ట్రాలకు చెందిన అదనపు బలగాలను ఉపయోగిస్తున్నట్లు జితేందర్ రెడ్డి వెల్లడించారు. స్వేచ్చాయుత పద్దతిలో శాంతియుతంగా ఎన్నికలు జరిగేలా చర్యలు తీసుకున్నట్లు పేర్కొన్నారు.