ఏపీ పోలీసులకు తెలంగాణ ఖాకీల ట్విస్ట్: కొత్తూరు వద్ద నారాయణను తరలిస్తున్న వాహనం నిలిపివేత

 ఏపీలో టెన్త్ క్లాస్ పేపర్ల లీకేజీలో మాజీ మంత్రి నారాయణను తరలిస్తున్న వాహనాన్ని కొత్తూరు వద్ద తెలంగాణ పోలీసులు నిలిపివేశారు. కిడ్నాప్ చేస్తున్నారని నారాయణ అరవడంతో తెలంగాణ పోలీసులు ఈ వాహనాన్ని అడ్డుకున్నారు. ఏపీ పోలీసులు తెలంగాణ పోలీసులతో చర్చిస్తున్నారు.

Telangana Police Stops Former Minister Narayana Vehicle At Kothur

హైదరాబాద్: Andhra Pradesh లో Tenth  ప్రశ్నాపత్రాల  లీకేజీలో అరెస్టైన మాజీ మంత్రి Narayana ను చిత్తూరుకు తరలిస్తున్న సమయంలో ట్విస్ట్ చోటు చేసుకొంది. నారాయణను తరలిస్తున్న వాహనాన్ని ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని Kothur వద్ద తెలంగాన పోలీసులు నిలిపివేశారు.

ఏపీలో SSC ప్రశ్నాపత్రాల Leakage కేసు విషయమై చిత్తూరు పోలీసులు మంగళవారం నాడు హైద్రాబాద్ లోని కొండాపూర్ లో మాజీ మంత్రి Narayanaను అరెస్ట్ చేశారు. Hyderabad నుండి నారాయణను Chittoor జిల్లాకు తరలిస్తున్నారు.  అయితే చిత్తూరుకు నారాయణను తరలించే సమయంలో వాహనంలో ఉన్న నారాయణను చిత్తూరుకు తరలిస్తున్నారు. అయితే ఈ సమయంలో తనను కిడ్నాప్ చేస్తున్నారని నారాయణ గట్టిగా అరవడంతో ఈ అరుపులు విన్న కొందరు పోలీసులకు సమాచారం ఇచ్చారు.ఈ సమాచారంతో అలెర్టైన పోలీసులు నారాయణ ను తరలిస్తున్న వాహనాన్ని కొత్తూరు చెక్ పోస్టు వద్ద నిలిపివేశారు.  నారాయణకు చెందిన స్వంత బెంజ్ కారు 8888 లోనే పోలీసులు చిత్తూరుకు తరలిస్తున్నారు.ఈ వాహనాన్ని కొత్తూరు పోలీసులు చెక్ పోస్టు వద్ద నిలిపివేశారు.

నారాయణను అరెస్ట్ చేసిన సమచారాన్ని ఏపీ పోలీసులు Telangana పోలీసులకు ఇవ్వలేదు దీంతో నారాయణ అరెస్ట్ విషయం తెలియని తెలంగాణ పోలీసులు కొత్తూరు వద్ద ఈ వాహనాన్ని నిలిపివేశారు. తెలంగాణ పోలీసులతో ఏపీ పోలీసులు చర్చలు జరుపుతున్నారు. ఈ విషయమై ఏపీ పోలీసులు స్పస్టత ఇవ్వడంతో తెలంగాణ పోలీసులు నారాయణ వాహనాన్ని చిత్తూరుకు తరలించేందుకు అనుమతి ఇచ్చారని సమాచారం.

చిత్తూరులోని నారాయణ స్కూల్ నుండి తెలుగు ప్రశ్నాపత్రం లీకైనట్టుగా పోలీసులు గుర్తించారు. ఈ విషయమై చిత్తూరు డీఈఓ ఫిర్యాదు మేరకు  పోలీసులు  గత నెల 27న కేసు నమోదు చేశారు. ఈ కేసులో భాగంగా నారాయణను పోలీసులు అరెస్ట్ చేశారు.  ఏపీలో టెన్త్ క్లాసులో పేపర్ల లీకేజీ తో పాటు మాల్ ప్రాక్టీస్ విసయమై ఇప్పటికే 50 మందిని అరెస్ట్ చేశారు. ఇందులో నారాయణ స్కూల్స్ కు చెందిన వైస్ ప్రిన్సిపల్ గిరిధర్ తో పాటు ఆ విద్యా సంస్థలకు చెందిన మరో ఇద్దరిని కూడా అరెస్ట్ చేశారు.మరో వైపు ఇవాళ ఉదయం హైద్రాబాద్ లో నారాయణను పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే..

నారాయణ స్కూల్స్ తో పాటు శ్రీ చైతన్య విద్యా సంస్థల నుండి కూడా పేపర్లు లీకయ్యాయని ఏపీ సీఎం వైఎస్ జగన్ ఆరోపించారు. పేపర్ల లీకేజీ వెనుక  టీడీపీ నేతలే ఉన్నారని జగన్ ఆరోపించారు. పైగా ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios