తెలంగాణలో ప్రస్తుతం కొనసాగుతున్న ఎస్‌ఐ, కానిస్టేబుల్ నియామక ప్రక్రియకు సంబంధించిను మెయిన్స్ ఎగ్జామ్ తేదీలు ఖరారు అయ్యాయి. ఎస్‌ఐ, కానిస్టేబుల్ మెయిన్స్ ఎగ్జామ్స్ తేదీలను తెలంగాణ స్టేట్ లెవల్ పోలీసు రిక్రూట్‌మెంట్ బోర్డు ఆదివారం ప్రకటించింది.
తెలంగాణలో ప్రస్తుతం కొనసాగుతున్న ఎస్‌ఐ, కానిస్టేబుల్ నియామక ప్రక్రియకు సంబంధించిను మెయిన్స్ ఎగ్జామ్ తేదీలు ఖరారు అయ్యాయి. ఎస్‌ఐ, కానిస్టేబుల్ మెయిన్స్ ఎగ్జామ్స్ తేదీలను తెలంగాణ స్టేట్ లెవల్ పోలీసు రిక్రూట్‌మెంట్ బోర్డు ఆదివారం ప్రకటించింది. రిక్రూట్‌మెంట్ ప్రక్రియలో భాగంగా డిసెంబర్ 8 నుంచి నిర్వహిస్తున్న ఫిజికల్ ఈవెంట్స్ ప్రక్రియ జవనరి 5వ తేదీతో ముగుస్తుందని తెలిపింది. అభ్యర్థులు ఫిజికల్ ఈవెంట్స్‌లో చాలా బాగా పర్ఫామ్ చేస్తున్నారని తెలిపింది. ఫిజికల్ ఈవెంట్స్‌లో క్వాలిఫై అయిన అభ్యర్థులు తుది రాత పరీక్షకు అర్హులని పేర్కొంది.
మార్చి 12 నుంచి ఎస్‌ఐ, కానిస్టేబుల్ మెయిన్ ఎగ్జామ్స్ ప్రారంభం కానున్నాయని తెలిపింది. ఏప్రిల్ 23 వరకు ఈ పరీక్షలను నిర్వహించనున్నారు. ఏప్రిల్ 9న సివిల్ ఎస్‌ఐ నియామక పరీక్షలు జరుగనున్నాయి. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను https://www.tslprb.in/ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది.
ఇక, ఏప్రిల్ 23న అన్ని రకాల కానిస్టేబుల్ పోస్టులకు మెయిన్స్ ఎగ్జామ్స్ నిర్వహిస్తారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పేపర్-1, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు పేపర్-2 పరీక్ష ఉంటుంది. అయితే ఈ పరీక్షలకు సంబంధించి హాల్‌టికెట్లను ఎప్పటినుంచి డౌన్‌లోడ్ చేసుకోవాలనే వివరాలను తర్వాత వెల్లడిస్తామని తెలిపింది. డ్రైవర్, డ్రైవర్ ఆపరేటర్స్, మెకానిక్స్‌కు సంబంధించిన పోస్టులకు ట్రేడ్/డ్రైవింగ్ టెస్ట్‌ల తేదీలను తగిన సమయంలో వెల్లడిస్తామని పేర్కొంది.
