తెలంగాణ పోలీస్ కానిస్టేబుల్ రాత పరీక్ష రీ షెడ్యూల్: ఆగష్టు 21 పరీక్ష 28న నిర్వహణ
తెలంగాణలో పోలీస్ కానిస్టేబుళ్ల పరీక్ష తేదీని రీ షెడ్యూల్ చేసింది పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డు.ఈ నెల 21న నిర్వహించాల్సిన పరీక్షను ఈ నెల 28కి మార్చినట్టుగా బోర్డు ప్రకటించింది.
హైదరాబాద్: Telangana లో పోలీస్ కానిస్టేబుళ్ల పరీక్ష తేదీలను రీ షెడ్యూల్ చేస్తున్నట్టుగా పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డు సోమవారం నాడు ప్రకటించింది.ఈ నెల 21న నిర్వహించాల్సిన పరీక్షను ఈ నెల 28న నిర్వహించనున్నట్టుగా Telangana State Level Police Recruitment Board వివరించింది. సాంకేతిక కారణాలతోనే వారం రోజుల తర్వాత ఈ పరీక్షను నిర్వహిస్తున్నట్టుగా బోర్డు తెలిపింది. ఈ నెల 18వ తేదీ నుండి వెబ్ సైట్ నుండి హల్ టికెట్లను డౌన్ లోడ్ చేసుకోవచ్చని కూడా బోర్డు తెలిపింది.
రాష్ట్రంలో 15,644 కానిస్టేబుల్ పోస్టులకు రాత పరీక్షలను ఈ నెల 21 నిర్వహిస్తున్నట్టుగా ప్రకటించారు. అయితే సాంకేతిక కారణాతో ఈ పరీక్షలను ఈ నెల 28వ తేదీకి వాయిదా వేసినట్టుగా పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డు వివరింది.
రాష్ట్రంలోని 15,664 కానిస్టేబుల్ పోస్టులకు గాను సుమారు 6.50 లక్షల మంది ధరఖాస్తు చేసుకున్నారు. సబ్ ఇన్స్ పెక్టర్ పోస్టులకు ఈ నెల 7న పరీక్షలు నిర్వహించారు. నిమిషం ఆలస్యమైనా అభ్యర్ధులను అనుమతించలేదు. మొత్తం 554 ఎస్ఐ పోస్టులకు రాత పరీక్ష నిర్వహించారు. సివిల్ కానిస్టేబుల్ పరీక్షలతో పాటు 614 ఎక్సైజ్ కానిస్టేబుల్ పోస్టులకు కూడా పరీక్షలు నిర్వహించనుంది పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డు.
ఎస్ఐ, కానిస్టేబుళ్ల పోస్టుల భర్తీ కోసం ఈ ఏడాది ఏప్రిల్ 25న పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డు నోటిపికేషన్ విడుదల చేసింది. ఎక్సైజ్ కానిస్టేబుళ్ల భర్తీకి ఏప్రిల్ 28వ తేదీన నోటిఫికేషన్ జారీ చేసిన విషయం తెలిసిందే. కానిస్టేబుల్ పరీక్షలో 200 మార్కులుంటాయి. ఇందులో 60 మార్కులు తెచ్చుకొంటే ప్రిలిమ్స్ క్యాలిఫై అవుతారు.