Telangana police recruitment 2022: తెలంగాణలో పోలీసు నియామకాలకు నోటిఫికేషన్ విడుదల అయింది. కానిస్టేబుల్, ఎస్సై పోస్టుల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్‌ను తెలంగాణ పోలీసు రిక్రూట్‌మెంట్ బోర్టు నేడు విడుదల చేసింది. 

తెలంగాణలో పోలీసు నియామకాలకు నోటిఫికేషన్ విడుదల అయింది. కానిస్టేబుల్, ఎస్సై పోస్టుల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్‌ను తెలంగాణ పోలీసు రిక్రూట్‌మెంట్ బోర్టు నేడు విడుదల చేసింది. మొత్తం 16,614 పోస్టుల భర్తీ నోటిఫికేషన్ జారీ అయింది. ఇందులో 16,027 కానిస్టేబుల్ పోస్టులు, 587 ఎస్‌ఐ పోస్టులు ఉన్నాయి. మే 2 నుంచి 20 వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులను స్వీకరించనున్నారు. అభ్యర్థులు www.tslprb.inలో దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పారు. 

మొత్తం 587 ఎస్‌ఐ పోస్టుల్లో.. 414 సివిల్ ఎస్సై పోస్టులు, 66 ఏఆర్ ఎస్సై పోస్టులు, 5 ఎస్ఏఆర్ సీపీఎల్ ఎస్సై పోస్టులు, 23 టీఎస్‌ఎస్‌పీ ఎస్సై పోస్టులు, 12 స్పెష‌ల్ ప్రొటెక్ష‌న్ ఫోర్స్ ఎస్సై పోస్టులు, విపత్తు, అగ్నిమాపక శాఖలో 26 ఎస్సై పోస్టులు, జైళ్ల శాఖలో 8 ఎస్సై పోస్టులు, ఐటీ అండ్ క‌మ్యూనికేష‌న్‌లో 22 ఎస్సై పోస్టులు, పోలీసు ట్రాన్స్‌పోర్ట్ ఆర్గ‌నైజేష‌న్‌లో 3 ఎస్సై పోస్టులు, ఫింగ‌ర్ ప్రింట్ బ్యూరోలో 8 ఎస్సై పోస్టులు ఉన్నాయి.

కానిస్టేబుల్స్ పోస్టులు..
సివిల్ కానిస్టేబుళ్లు- 4,965
ఏఆర్ కానిస్టేబుళ్లు- 4,423
టీఎస్ఎస్‌పీ బెటాలియన్ కానిస్టేళ్లు- 5,010
స్పెషల్ పోలీస్ ఫోర్స్- 390
విప‌త్తు నిర్వ‌హ‌ణ, అగ్నిమాప‌క శాఖ -610
పోలీసు కానిస్టేబుల్ (మెకానిక్)- 21
పోలీసు కానిస్టేబుల్ (డ్రైవ‌ర్) -100
ఎస్ఏఆర్ సీఎల్ – 100
జైళ్ల శాఖ వార్డెన్( పురుషులు) – 136
జైళ్ల శాఖ వార్డెన్ (స్త్రీలు )-10
ఐటీ, క‌మ్యూనికేష‌న్ -262