తెలంగాణ  బీజేపీ అధ్యక్సుడు బండి సంజయ్‌‌కు పోలీసులు 41ఏ సీఆర్‌పీసీ కింద నోటీసులు జారీచేసింది. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజున నాగోల్‌లో టీ బీజేపీ నిర్వహించిన అమరుల సభ‌లో ప్రదర్శించిన స్కిట్ వ్యవహారంలో పోలీసులు ఈ నోటీసులు జారీ చేశారు.

తెలంగాణ బీజేపీ అధ్యక్సుడు బండి సంజయ్‌‌కు పోలీసులు 41ఏ సీఆర్‌పీసీ కింద నోటీసులు జారీచేసింది. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజున నాగోల్‌లో టీ బీజేపీ అమరుల సభ నిర్వహించింది. ఈ సభలో తెలంగాణ సీఎం కేసీఆర్, ప్రభుత్వ పథకాలను కించపరిచేలా స్కిట్ ప్ర‌ద‌ర్శించార‌ని టీఆర్ఎస్ సోష‌ల్ మీడియా క‌న్వీన‌ర్ వై స‌తీశ్ రెడ్డి హ‌య‌త్ న‌గ‌ర్ పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు. 

ఈ క్రమంలోనే పోలీసులు రాణి రుద్రమ, దరువు ఎల్లన్న‌లను అరెస్ట్ చేశారు. ఇదే అంశంలో పోలీసులు జిట్టా బాలకృష్ణను హ‌య‌త్ న‌గ‌ర్ పోలీసులు శుక్ర‌వారం తెల్ల‌వారుజామున అరెస్ట్ చేశారు. అదే రోజు బెయిల్‌పై జిట్టా బాలకృష్ణ విడుదల అయ్యారు. తాజాగా ఇందుకు సంబంధించి పోలీసులు బండి సంజయ్‌కు.. 41ఏ సీఆర్‌పీసీ కింద నోటీసులు జారీచేశారు.