తెలంగాణలో పెండింగ్ చలానాలపై (pending challan) రాయితీ ప్రకటిస్తూ ఇటీవల పోలీస్ శాఖ (telangana police) నుంచి సంకేతాలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆదివారం రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్ చలాన్లపై అధికారులు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు
తెలంగాణలో పెండింగ్ చలానాలపై (pending challan) రాయితీ ప్రకటిస్తూ ఇటీవల పోలీస్ శాఖ (telangana police) నుంచి సంకేతాలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆదివారం రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్ చలాన్లపై అధికారులు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. పెండింగ్ చలాన్లకు భారీగా రాయితీలకు శ్రీకారం చుట్టారు. టూ, త్రీవీలర్స్, తోపుడు బండ్లకు 75 శాతం వరకు రాయితీ ఇస్తున్నారు. అలాగే ఆర్టీసీ బస్సుఅలకు 70 శాతం రాయితీ ఇస్తున్నట్లు పోలీస్ శాఖ పేర్కొంది. కార్లు, హెవీ వెహికల్స్‌కు 50 శాతం డిస్కౌంట్‌తో పాటు మాస్కులు ధరించని వారి ఫైన్లకు కూడా భారీ రాయితీ ఇస్తున్నారు. చలాన్‌లో విధించిన వెయ్యికి రూ.100 చెల్లిస్తే క్లియర్ చేస్తున్నారు. మార్చి 1 నుంచి 31 వరకు ఈ చలాన్ల వెబ్‌సైట్‌లో పేమెంట్లు ఇస్తున్నట్లు పోలీస్ శాఖ పేర్కొంది.
కాగా.. హైద్రాబాద్, రాచకొండ, సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ల పరిధిలో సుమారు రూ. 600 కోట్ల మేరకు పెండింగ్ చలాన్లు ఉన్నాయని పోలీస్ శాఖ గుర్తించింది. అయితే మార్చి 1 నుండి 31వ తేదీ లోపుగా పెండింగ్ చలాన్లు చెల్లించిన వారికి డిస్కౌంట్ ఇచ్చింది పోలీస్ శాఖ. మరో వైపు హైద్రాబాద్ లో ప్రమాదాలు ఏ సమయంలో జరుగుతున్నాయనే విషయమై కూడా అధ్యయనం చేశారు. రాత్రి పూట మాత్రమే ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్నాయని ట్రాఫిక్ పోలీసులు గుర్తించారు. అయితే రాత్రి సమయాల్లో వాహనాల వేగాన్ని నియంత్రించేందుకు స్పీడ్ గన్ లను ఉపయోగించాలని భావిస్తున్నారు.
మద్యం తాగి వాహనాలు నడపకుండా ట్రాఫిక్ పోలీసులు చర్యలు తీసుకొంటున్నారు. రాత్రి పూట చెక్ పోస్టులు ఏర్పాటు చేస్తున్నారు. హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ శాఖ పరిధిలో సౌత్, నార్త్, ఈస్ట్, వెస్ట్, సెంట్రల్, వెస్ట్-సెంట్రల్ అనే ఆరు జోన్లున్నాయి. ఈ జోన్లలో ట్రాఫిక్ నియంత్రణ కోసం 2500 మంది కానిస్టేబుళ్లు పనిచేస్తున్నారు. 2016 నుండి ఉన్న ఆటో రిక్షాల మీటర్ల రేట్లను త్వరలోనే సవరించే అవకాశం ఉంది.
ప్రస్తుతం చాలా మంది ఆటో డ్రైవర్లు మీటర్లను ఉపయోగించడం లేదు. దీంతో ప్రయాణీకులు ఇబ్బంది పడుతున్నారు. దీంతో మీటర్ల రేట్ ను సవరించే అవకాశాలను కూడా ట్రాఫిక్ పోలీసులు పరిశీలిస్తున్నారు. కరోనా కారణంగా పెండింగ్ చలాన్ల చెల్లింపు విషయంలో కూడా పోలీస్ శాఖ డిస్కౌంట్ ఇవ్వాలని నిర్ణయం తీసుకొందనే ప్రచారం కూడా లేకపోలేదు. అయితే పోలీస్ శాఖ తీసుకొన్న నిర్ణయం మాత్రం వాహనదారులకు పెద్ద ఊరటగానే చెప్పవచ్చు. పెండింగ్ లో ఉన్న చలాన్లు ఉంటే ట్రాఫిక్ పోలీసులు ఎక్కడైన వాహనాన్ని నిలిపివేస్తే అక్కడే పెండింగ్ చలాన్లు చెల్లించాల్సిన పరిస్థితులున్నాయి. అయితే మార్చి మాసంలో నిర్వహించే స్పెషల్ డ్రైవ్ ను ఉపయోగించుకోవాలని వాహన దారులకు పోలీస్ శాఖ సూచిస్తోంది.
