వచ్చే జనవరి మధ్య నాటికి రాష్ట్రంలో 80 లక్షల మందికి టీకా వేయాలని తెలంగాణ వ్యూహాలు రచిస్తోంది. ఈ మేరకు టీకా వేయడానికి శిక్షణ, ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. 

సంక్రాంతి నాటికి కోవిద్ 19 వ్యాక్సిన్ తెలంగాణలో ప్రారంభం కానుందని, మొదటి డోస్ లో 80 లక్షల మందికి ఎనిమిది నుండి పది రోజుల్లో ఇస్తామని, మరో నాలుగు వారాల్లో రెండవ డోస్ ఇస్తామని తెలంగాణ పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ జి. శ్రీనివాస్ రావు  తెలిపారు.

ఎమర్జెన్సీ వాడకానికి ఏ టీకాకు అనుమతి ఇవ్వబడలేదు. అయితే అందుతున్న సమాచారం ప్రకారం ఈ టీకా భారత్ బయోటెక్ కు చెందిన కోవాక్సిన్, సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియాకు చెందిన వ్యాక్సిన్ కావచ్చని అంటున్నారు. ఈ రెండూ మనదేశ వాతావరణ పరిస్థితులకు సరిపోయేవే.

పరిశీలనలో ఉన్న ఫైజర్ వ్యాక్సిన్ ను మనదేశంలో హ్యాండిల్ చేయడం కష్టం. దీన్ని అత్యంత శీతల గిడ్డంగుల్లో మైనస్ 70 డిగ్రీల సెల్సియస్ వద్ద భద్రపరచాల్సి ఉంటుంది. ఇది సాంకేతికంగా, లాజిస్టిక్‌గా కష్టమైనది. దీనితో పాటు ఇది చాలా ఖరీదైనది.

నిర్ధేశిత గ్రూపులకు ముందుగా టీకాను వేసే ఆపరేషన్ కు తెలంగాణలో  పూర్తి స్థాయిలో సన్నాహాలు జరుగుతున్నాయి. వచ్చే జనవరి మధ్య నాటికి రాష్ట్రంలో 80 లక్షల మందికి టీకా వేయాలని తెలంగాణ వ్యూహాలు రచిస్తోంది. ఈ మేరకు టీకా వేయడానికి శిక్షణ, ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. 

అవసరమైన మౌళిక సదుపాయాలు, మానవవనరులు ఈ నెల చివరికల్లా సిద్దమవుతాయిని శ్రీనివాసరావు ఆశాభావం వ్యక్తం చేశారు. చేసింది. "జనవరి మధ్యలో వ్యాక్సిన్ వేసే ప్రక్రియ ప్రారంభమవుతుందని ఆశిస్తున్నాము.  8-10 రోజుల్లో నిర్ధేశిత జనాభాను కవర్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం" అని రావు చెప్పారు.

80 లక్షల మందికి గానూ రాష్ట్రానికి 1.6 కోట్ల మోతాదు వ్యాక్సిన్ అందుతుందని, దీన్ని రెండు షాట్లలో ఇవ్వనున్నారని తెలిపారు. మొదటి విడత ఆశావహుల్లో మూడు లక్షలమంది డాక్టర్లు, నర్సులు, వార్డ్ బాయ్స్, సాంకేతిక నిపుణులు ఉన్నారు.

రెండో గ్రూప్ లో ఫ్రంట్‌లైన్ కార్మికులు ఉన్నారు, ఇందులో లక్ష మంది పోలీసు సిబ్బంది, శానిటరీ కార్మికుల. రక్షణ సిబ్బంది ఉన్నారు.

ఇక మూడో కేటగిరి 50 ఏళ్లు పైబడిన వారు. వీళ్లు జనాభాలో 18 శాతం ఉన్నారు. ఇక నాలుగో కేటగిరి 50 కన్నా తక్కువ కొమొర్బిడిటీ ఉన్నవారు. వీరు జనాభాలో 2-3 శాతం ఉంటారు.

కోవిడ్ -19 వ్యాక్సిన్లను ప్రత్యేకంగా నిల్వ చేసేందుకు 10 కోట్ల మోతాదు సామర్థ్యం ఉన్న 10 కొత్త ప్రాంతీయ వ్యాక్సిన్ సోర్స్ సెంటర్లను గుర్తించారు. వీటిలో నిల్వ సామర్థ్యాన్ని పెంచడానికి మౌలిక సదుపాయాలు పెంచుతున్నారు. ప్రతి జిల్లాకు వ్యాక్సిన్లను రవాణా చేయడానికి కొత్త కోల్డ్ స్టోరేజ్ వ్యాన్లను పురమాయించారు.

ఇప్పటికే మముత్ టీకా డ్రైవ్ లతో శిక్షణ పొందిన సిబ్బంది రాష్ట్రంలో ఉండడం సంతోషపడాల్సిన విషయం. దీంతోపాటు రాష్ట్రంలో ఇప్పటికే వాక్ ఇన్ కూలర్లు కలిగిన 1,000 కేంద్రాలు ఉన్నాయి. ఇది కొత్త టీకా కాబట్టి.. ప్రజల్లో కలిగే ఆందోళనలను తగ్గించడానికి, టీకా డ్రైవ్‌లో ప్రజా ప్రతినిధులను చేర్చుకునేందుకు ప్రణాళికలు సిద్ధమవుతున్నాయన్నారు.  

తెలంగాణలో మొత్తం 2,78,599 COVID-19 కేసులు ఉన్నాయి, వీటిలో 491 కేసులు గత 24 గంటల్లో నమోదయ్యాయి. రికవరీ రేటు 95 శాతానికి పైగా ఉంది. మొత్తం మరణాలు 1,499. మరణాల రేటు మొత్తం 1.5 శాతం, తెలంగాణలో నిర్వహించిన మొత్తం పరీక్షలు 62,05,688.