Asianet News TeluguAsianet News Telugu

మునుగోడు ప్రజల తీర్పుపైనే రాష్ట్ర భవిష్యత్తు: సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క

 రాష్ట్ర భవిష్యత్తు మునుగోడు ప్రజల తీర్పుపై ఆధారపడి ఉంటుందని  సీఎల్పీ నేత భట్టి విక్రమార్కఅభిప్రాయపడ్డారు. మునుగోడు కాంగ్రెస్ కు బలమైన నియోజకవర్గంగా ఆయన పేర్కొన్నారు

Telangana People Future depends on munugode by poll Result:CLP  Leader Mallu Bhatti Vikramarka
Author
First Published Sep 18, 2022, 3:53 PM IST


 

హైదరాబాద్: రాష్ట్ర భవిష్యత్తు మునుగోడు ప్రజల తీర్పుపై ఆధారపడి ఉంటుందని  సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అభిప్రాయపడ్డారు. ఆదివారం నాడు కాంగ్రెస్ పార్టీ  కార్యకర్తల సమావేశం మునుగోడులో నిర్వహించారు. ఈ సమావేశంలలో సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క పాల్గొన్నారు. నిజాంకు వ్యతిరేకంగా పోరాటం చేసిన గడ్డ మునుగోడుదని ఆయన గుర్తు చేశారు. ఇలాంటి చరిత్ర ఈ ప్రాంత ప్రజలు టీఆర్ఎస్, బీజేపీకి లొంగిపోరని ఆయన చెప్పారు. పాల్వాయి స్రవంతిని ఆశీర్వదించాలని ఆయన ప్రజలను కోరారు. కాంగ్రెస్ కు మునుగోడు బలమైన డివిజన్ గా ఆయన పేర్కొన్నారు.  తెలంగాణలో టీఆర్ఎస్ పాలనను ప్రజలు  వద్దంటున్నారన్నారు. టీఆర్ఎస్ సర్కార్ అవినీతికి పాల్పడుతూ  రాష్ట్రాన్ని నవ్వులపాలు చేస్తున్నారని భట్టి విక్రమార్క విమర్శించారు.  ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయడంలో సర్కార్ విఫలమైందన్నారు.

ఈ ఏడాది ఆగస్టు 4వ తేదీన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. గత నెల 8వ తేదీన మునుగోడు ఎమ్మెల్యే పదవికి కూడా ఆయన  రాజీనామా చేశారు.  ఈ రాజీనామాను స్పీకర్ ఆమోదించారు. గత నెల 21న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మునుగోడులో జరిగిన సభలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా సమక్షంలో బీజేపీలో చేరారు. గత ఎ(న్నికల్లో ఈ స్థానం నుండి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ అభ్యర్ధిగా విజయం సాధించారు.   ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్ధిగా పోటీ చేయనున్నారు. 

also read:మునుగోడు ఉప ఎన్నికలు 2022: కాంగ్రెస్ ఎన్నికల ప్రచార కమిటీ చైర్మెన్ గా దామోదర్ రెడ్డి నియామకం

త్వరలో జరిగే ఉప ఎన్నికల్లో మునుగోడు స్థానం నుండి కాంగ్రెస అభ్యర్ధిగా పాల్వాయి స్రవంతి బరిలోకి దిగనుంది. మాజీ మంత్రి పాల్వాయి గోవర్ధన్ రెడ్డి కూతురే పాల్వాయి గోవర్ధన్ రెడ్డి,. ఉమ్మడి ఏపీ అసెంబ్లీకి మునుగోడు అసెంబ్లీ స్థానం నుండి పాల్వాయి గోవర్ధన్ రెడ్డి పలు దఫాలు కాంగ్రెస్ అభ్యర్ధిగా విజయం సాధించారు.

మునుగోడు అసెంబ్లీ స్థానంలో విజయం సాధించాలని బీజేపీ పట్టుదలతో ఉంది.  కేంద్ర హోం మంత్రి అమిత్ షా తో మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నిన్న ప్రత్యేకంగా సమావేశమయ్యారు. రాష్ట్రానికి చెందిన పార్టీ నేతలతో కూడా  అమిత్ షా నిన్న సమావేశమయ్యారు. మునుగోడు అసెంబ్లీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంతో పాటు ఇతర విషయాలపై పార్టీ నేతలకు అమిత్ షా దిశా నిర్దేశం చేశారు. 

Follow Us:
Download App:
  • android
  • ios