తెలంగాణ తొలి దశ పరిషత్ ఎన్నికల్లో అధికారుల నిర్లక్ష్యం వెలుగు చూసింది. నిజామాబాద్ జిల్లాలోని ఓ పోలింగ్ బూత్‌లో ప్రజలు రెండు సార్లు ఓటేశారు. నవీపేట్ పోలింగ్ కేంద్రానికి నాలేశ్వర్ గ్రామానికి చెందిన బ్యాలెట్ పేపర్లు వచ్చాయి.

ఇది గమనించిన అధికారులు వాటిపైనే ఓటు వేయించారు. అయితే వెంటనే బ్యాలెట్ పత్రాలు తారుమారైనట్లు గుర్తించిన అధికారులు ఒక ఓటరు అధికారులకు ఫిర్యాదు చేయడంతో వారి పొరపాటు వెలుగులోకి వచ్చింది. దీంతో అంతకు ముందు ఓటు హక్కు వినియోగించుకున్న వారిని మరోసారి వెనక్కి పిలిచి ఓటు వేయించారు అధికారులు.