తెలంగాణ తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఎదురు లేకుండా దూసుకెళ్లింది. ఆ పార్టీ మద్ధతు ప్రకటించిన అధ్యర్థులు భారీ సంఖ్యలో గెలుపొందారు. తొలి దశలో 4, 479 గ్రామ పంచాయతీల ఎన్నికకు నోటీసులు ఇవ్వగా... 769 పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి.

మిగిలిన 3701 పంచాయతీల్లో ఎన్నికల సంఘం పోలింగ్ జరిపింది. సోమవారం జరిగిన మధ్యాహ్నాం వరకు జరిగిన ఎన్నికల్లో 85.76 శాతం పోలీంగ్ నమోదైంది. ఆ తర్వాత 2 గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభించారు.  రాత్రి నాటికి వెలువడిన తుది ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి.


టీఆర్ఎస్: 2,629
కాంగ్రెస్: 920
టీడీపీ: 31
బీజేపీ: 67
సీపీఐ: 19
సీపీఎం: 32
ఇతరులు: 758 
ఫలితం తెలనివి: 14