రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రతి విషయంలోనూ ఒకే మాట మీద ఉంటున్నారు. ఇరు రాష్ట్రాలకు సంబంధించిన ప్రతి సమస్యను సానుకూలంగా మాట్లాడి పరిష్కరించుకుంటున్నారు. నదీ జలాలపై కూడా ఇప్పటికే వీరిద్దరూ సమామేశమై చర్చించుకున్నారు కూడా. ఒక రాష్ట్రానికి మరొకరు సహాయంగా ఉంటున్నారు. కృష్ణా నదీ జలాల విషయంలో కూడా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సానుకూలంగా ఉన్నారు. అయితే... సీఎం లేని సమస్య ఇప్పుడు అధికారులకు వచ్చినట్లు అనిపిస్తోంది.

సాగునీటిపై ఏపీతో సీఎం కేసీఆర్‌ సానుకూలంగా ఉండగా.. అధికారులు మాత్రం ఇందుకు భిన్నంగా వ్యవహరించడం చర్చనీయాంశంగా మారింది. ఆంధ్రప్రదేశ్‌పై కృష్ణా బోర్డుకు తెలంగాణ ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌ ఫిర్యాదు చేశారు. ఏపీ ఎక్కువ నీటిని తరలిస్తూ తక్కువగా చూపిస్తోందని ఫిర్యాదులో పేర్కొన్నారు. పోతిరెడ్డిపాడుకు జాయింట్‌ టీమ్‌ను రానివ్వడం లేదని తెలిపారు. చర్యలు తీసుకోకపోతే విశ్వసనీయత ఉండదంటూ బోర్డుకు లేఖ రాశారు. మరి ఈ విషయం పై ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఎలా స్పందిస్తారో చూడాలి.