05:22 PM (IST) Jan 25

నారాయణపేట్ లో హోరాహోరీ... టీఆర్ఎస్ కు బిజెపి గట్టి పోటీ

నారాయణపేట్ మున్సిపాలిటీలో టీఆర్ఎస్, బిజెపి ల మధ్య హోరాహోరీ పోరు సాగింది. ఇవాళ వెలువడిన ఫలితాల్లో టీఆర్ఎస్ 10 వార్డులు గెలుచుకోగా బిజెపి 9 వార్డుల్లో విజయాన్ని సాధించింది. ఇక కాంగ్రెస్ 2, ఇతరులు 3 వార్డులు గెలుచుకున్నారు. 

05:08 PM (IST) Jan 25

తాము కాదు ఈ ఫలితాలే బిజెపి బుద్దిచెబుతాయి..: మంత్రి ఎర్రబెల్లి

ప్రస్తుత మున్సిపల్ ఎన్నికల ఫలితాలను చూసిన తర్వాత అయినా బిజెపి బుద్ది తెచ్చుకోవాలని మంత్రి ఎర్రబెల్లి విమర్శించారు. అభివృద్ది ప్రాజెక్టులపై కేసులు వేస్తే ఏం జరుగుతుందో తెలుసుకోవాలన్నారు. దేశంలో ఏ రాష్ట్రానికి రానన్ని అవార్డులు తెలంగాణకు వస్తున్నాయన్నారు. 

టీఆర్ఎస్ ప్రభుత్వంతోనే అభివృద్ది సాధ్యమని ఈ ఫలితాల ద్వారా రాష్ట్ర ప్రజలు మరోసారి తేల్చారన్నారు. ఈ విజయాన్ని కట్టబెట్టిన రాష్ట్ర ప్రజలకు ఎర్రబెల్లి కృతజ్ఞతలు, గెలుపొందిన అభ్యర్ధులకు అభినందనలు, శుభాకాంక్షలు తెలిపారు.

04:44 PM (IST) Jan 25

మున్సిపల్ ఎలక్షన్స్ టీఆర్ఎస్ హవా... కేటీఆర్ కు హరీష్ అభినందనలు

''ఎన్నికలు ఏవైనా గెలుపు మాత్రం టిఆర్ఎస్ దేనని మరోసారి రుజువు చేశారు తెలంగాణ ప్రజలు. మునిసిపల్ ఎన్నికల్లోనూ టిఆర్ఎస్ ప్రభంజనమే వీసింది. ముఖ్యమంత్రి కేసీఆర్ కూ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు అభినందనలు.'' అంటూ మంత్రి హరీష్ రావు ట్వీట్ చేశారు. 

04:38 PM (IST) Jan 25

కామారెడ్డిలో తేలని ఫలితం... మ్యాజిక్ ఫిగర్ కు చేరువలో టీఆర్ఎస్

కామారెడ్డి మున్సిపాలిటీ ఎన్నికల్లో ఓటర్లు విభిన్నమైన తీర్పునిచ్చారు. ఇక్కడ ఏ పార్టీ కూడా ఛైర్మన్ పదవిని దక్కించుకునేందుకు కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ సాధించలేకపోయాయి. అధికార టీఆర్ఎస్ కేవలం రెండు వార్డుల దూరంలో నిలిచిపోయింది. 

కామారెడ్డిలో మొత్తం 49 వార్డులకుగానూ టీఆర్ఎస్ 23, కాంగ్రెస్ కు 12, బిజెపి 8, ఇండిపెండెంట్లు 6 వార్డులను కైవసం చేసుకున్నారు. 

04:26 PM (IST) Jan 25

కేసీఆర్, కేటీఆర్ లే మా నాయకులు..: మాజీ మంత్రి జూపల్లి

కొల్లాపూర్, ఐజ మున్సిపాలిటీల్లో టీఆర్ఎస్ రెబల్ గా బరిలోకి దిగిన మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు వర్గీయలు సత్తాచాటారు. ఫార్వర్డ్ బ్లాక్ తరపున బరిలోకి దిగిన జూపల్లి వర్గం రెండు మున్సిపాలిటీల్లో అత్యధిక స్థానాలు కైవసం చేసుకుంది. ఈ సందర్భంగా జూపల్లి మాట్లాడుతూ... తాము టీఆర్ఎస్ రెబల్స్ కాదు టీఆర్ఎస్ నాయకులమేనని అన్నారు. తామింకా టీఆర్ఎస్ పార్టీలోనే వున్నామని... తమ నాయకులు కేసీఆర్, కేటీఆర్ లేనని ఆయన స్పష్టం చేశారు. మిగతా విషయాలు టీఆర్ఎస్ అధిష్టానంతో మాట్లాడిన తర్వాత మీడియాకు వెల్లడిస్తానని జూపల్లి అన్నారు. 

04:12 PM (IST) Jan 25

పెద్ద అంబర్‌పేట్ హస్తగతం... టీఆర్ఎస్ కు తప్పని ఓటమి

హైదరాబాద్ శివారులోని పెద్ద అంబర్ పేట మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. అక్కడి ప్రజలు అధికార టీఆర్ఎస్ పార్టీని కాదని ఛైర్మన్ పదవిని కాంగ్రెస్ హస్తగతం చేశారు. 

04:06 PM (IST) Jan 25

మహిళా కౌన్సిలర్ కిడ్నాప్...: ఎలక్షన్ కమీషన్ కు రేవంత్ రెడ్డి ఫిర్యాదు

కోస్గి మున్సిపాలిటీ 16వ వార్డు నుండి గెలుపొందిన ఎల్లమ్మ అనే మహిళను స్వయంగా జిల్లా ఎస్పీ బలవంతంగా తీసుకెళ్లారని ఎంపీ రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఈ మేరకు ఆయన రాష్ట్ర ఎన్నికల కమీషనర్ కు ఫోన్ ద్వారా ఫిర్యాదు చేశారు. ఒక కాంట్రాక్టర్ ఇంటికి స్వయంగా పోలీసులే ఆమెను తీసుకెళ్లారని... అక్కడ ఆమెను ప్రలోభాలకు గురిచేశారంటూ రేవంత్ ఆరోపించారు.

03:55 PM (IST) Jan 25

తృటిలో చేజారిన మున్సిపాలిటీలపై టీఆర్ఎస్ కన్ను... ప్రయోగించే అస్త్రమిదే

తెలంగాణ వ్యాప్తంగా అన్ని మున్సిపాలిటీల్లో టీఆర్ఎస్ జెండా ఎగరేసే దిశగా టీఆర్ఎస్ పావులు కదుపుతోంది. ఇప్పటికే తొంబై శాతానికి పైగా మున్సిపాలిటీల్లో విజయాన్ని అందుకున్న ఆ పార్టీ టఫ్ ఫైట్ వున్నచోట ఎక్స్ అఫిషియో ఓట్లను ఉపయోగించుకుని ఛైర్మన్ పీఠం టీఆర్ఎస్ కే దక్కేలా ఎత్తులు వేస్తోంది. నారాయణఖేడ్, అరమచింత, హాలియా, యాదగిరిగుట్ట, మక్తల్, బోడుప్పల్, కొంపల్లి, ఖానాపూర్, కోస్గిలలో కేవలం ఒకటి రెండు వార్డుల తేడా మాత్రమే వున్నందున ఇక్కడ ఎక్స్ అఫిషోయో ఓట్లను ఉపయోగించుకోవాలని టీఆర్ఎస్ భావిస్తోంది. ఈ మేరకు ఎక్స్ అపిషియో ఓటేసే ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల జాబితాను సిద్దం చేసి సాయంత్రం ఈసీకి అందించనున్నట్లు టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. 

03:42 PM (IST) Jan 25

ఫ్యామిలీ సెంటిమెంట్... సంగారెడ్డిలో పారని జగ్గారెడ్డి వ్యూహం

సంగారెడ్డి జిల్లా కేంద్రంలో స్ధానిక ఎమ్మెల్యే జగ్గారెడ్డికి టీఆర్ఎస్ షాకిచ్చింది. పట్టణంలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో ఛైర్మన్ అభ్యర్ధి అయిన ఎమ్మెల్యే సతీమణి నిర్మలా జగ్గారెడ్డి కౌన్సిలర్ గా గెలిచినా ఫలితం లేకుండా పోయింది. అత్యధిక స్థానాలు టీఆర్ఎస్ కైవసం చేసుకోవడంతో ఛైర్మన్ పీఠం కాంగ్రెస్ చేజారింది.

సంగారెడ్డి లో మొత్తం 38 వార్డుల్లో టీఆర్ఎస్ 18, కాంగ్రెస్ 12, ఎంఐఎం, బిజెపి చెరొకటి గెలుచుకోగా మిగతాచోట్లు ఇండిపెండెంట్లు గెలుపొందారు.

03:21 PM (IST) Jan 25

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మున్సిపల్ ఎన్నికల ఫలితాలు

కొత్తపల్లి మున్సిపాలిటీ : 12
తెరాస : 11
కాంగ్రెస్ : 01
బీజేపీ :00
ఇతరులు :00

జమ్మికుంట మున్సిపాలిటీ:30
తెరాస : 22
కాంగ్రెస్ :03
బీజేపీ :00
ఇతరులు :05

హుజురాబాద్ మున్సిపాలిటీ : 30
తెరాస : 21
కాంగ్రెస్ :01
బీజేపీ :05
ఇతరులు :03

చొప్పదండి మున్సిపాలిటీ :14
తెరాస : 09
కాంగ్రెస్ :02
బీజేపీ :02
ఇతరులు :01

జగిత్యాల జిల్లా

జగిత్యాల మున్సిపాలిటీ : 48
తెరాస : 30
కాంగ్రెస్ : 07
బీజేపీ : 03
ఇతరులు : 08

ధర్మపురి మున్సిపాలిటీ : 15
తెరాస : 08
కాంగ్రెస్ :07
బీజేపీ :00
ఇతరులు :00

రాయికల్ మున్సిపాలిటీ :12
తెరాస : 09
కాంగ్రెస్ :01
బీజేపీ :01
ఇతరులు :01

కోరుట్ల మున్సిపాలిటీ : 33
తెరాస : 21
కాంగ్రెస్ : 02
బీజేపీ :05
ఇతరులు : 05

మెట్టుపల్లి మున్సిపాలిటీ : 26

తెరాస : 17
కాంగ్రెస్ : 01
బీజేపీ :04
ఇతరులు :04

పెద్దపల్లి జిల్లా

పెద్దపల్లి మున్సిపాలిటీ :36
తెరాస : 24
కాంగ్రెస్ :4
బీజేపీ :2
ఇతరులు :6

సుల్తానాబాద్ మున్సిపాలిటీ.. 15

తెరాస : 9
కాంగ్రెస్ :6


మంథని మున్సిపాలిటీ :13..
తెరాస : 12
కాంగ్రెస్ :1


సిరిసిల్ల జిల్లా

సిరిసిల్ల మున్సిపాలిటీ : 39 
తెరాస : 22
కాంగ్రెస్ :02
బీజేపీ :03
ఇతరులు :12

వేములవాడ మున్సిపాలిటీ : 28
తెరాస : 16
కాంగ్రెస్ : 01
బీజేపీ :06
ఇతరులు :05

03:16 PM (IST) Jan 25

హంగ్ దిశగా రామగుండం కార్పోరేషన్

రామగుండం మున్సిపాలిటీ ప్రజలు వినూత్నమైన ఫలితాన్నిచ్చారు. ఏ పార్టీకి కూడా స్పష్టమైన ఆధిక్యాన్ని అందించలేదు. మొత్తం 50 డివిజన్లలో టీఆర్ఎస్ అత్యధికంగా 19 సాధించగా బిజెపి 15, కాంగ్రెస్ 11, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ 9 స్థానాలను దక్కించుకున్నాయి. దీంతో పొత్తులు లేకుండా మేయర్ అభ్యర్థిని ఎన్నుకునే పరిస్థితులు కనిపించడం లేదు. 

03:04 PM (IST) Jan 25

నిజామాబాద్ కార్పోరేషన్ లో ఉత్కంఠ...కౌటింగ్ కేంద్రం వద్ద భారీ బందోబస్తు

నిజామాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ లో ఇప్పటివరకు అందుతున్న సమాచారం మేరకు బిజెపి, టీఆర్ఎస్, ఎంఐఎం పార్టీలు సమానంగా నిలిచాయి. ఈ మూడు పార్టీల మధ్య పోరు నువ్వా నేనా అన్నట్లుగా సాగుతోంది. ఈ ఉత్కంఠ నేపథ్యంలో కౌంటింగ్ కేంద్రానికి ఈ మూడు పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు భారీగా చేరుకుంటున్నారు. దీంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు కూడా భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారరు.

02:55 PM (IST) Jan 25

నిర్మల్ లో టీఆర్ఎస్ ఘన విజయం...

నిర్మ‌ల్ మున్సిపాలిటీలో టీఆర్‌ఎస్ అఖండ‌ విజయం సాధించింది. 30 వార్డుల్లో టీఆర్ఎస్ 7 స్థానాల‌తో కాంగ్రెస్, 2 స్థానాల‌తో ఎంఐఎం, 1 స్థానంతో బీజేపీ లు స‌రిపెట్టుకున్నాయి. 2 వార్డుల్లో ఇండిపెండెంట్ అభ్య‌ర్థులు గెలుపొందారు.

ఈ ఫలితంపై మంత్రి అల్లోల‌ ఇంద్రకరణ్ రెడ్డి స్పందిస్తూ నిర్మ‌ల్ మున్సిపాలిటీలో అఖండ మెజార్టీతో గెలిపించిన ప్రజలకు ఓటర్లకు కృతజ్ఞతలు తెలిపారు. 30 వార్డుల్లో టీఆర్ఎస్ అభ్య‌ర్థుల విజ‌యానికి స‌మిష్టి కృషి చేసిన‌ నాయకులకు, కార్యకర్తలను ఈ సంద‌ర్బంగా అభినందించారు.

02:51 PM (IST) Jan 25

నేరేడుచెర్లలో సగం సగం... సిపిఐ చేతిలోనే తుది ఫలితం

నేరేడుచర్ల మున్సిపాలిటీలో ఆసక్తికరమైన ఫలితం వెలువడింది. ఇక్కడ మొత్తం 15 వార్డులకు గాను కాంగ్రెస్ 7, టీఆర్ఎస్ 7 వార్డులను గెలుచుకుని సమానంగా నిలవగా ఓ వార్డులో సిపిఐ అభ్యర్థి విజయం సాధించారు. దీంతో ముందుగానే జాగ్రత్తపడ్డ కాంగ్రెస్ అతన్ని క్యాంపుకు తరలించింది. అయితే టీఆర్ఎస్ కూడా ఎక్స్ అఫిషియో సభ్యులను ఉపయోగించుకుని ఈ స్ధానాన్ని కైవసం చేసుకోవాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. 

02:39 PM (IST) Jan 25

బిజెపి ఖాతాలో రెండోది... మక్తల్ లో ఘన విజయం

తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఖాతాలోకి మరో మున్సిపాలిటీ చేరింది. ఇప్పటికే అమన్ గల్ స్ధానాన్ని కైవసం చేసుకున్న కమళదళం తాజాగా మక్తల్ మున్సిపాలిటీని కూడా తన ఖాతాలో వేసుకుంది. ఇలా మొత్తంగా బిజెపి రెండు మున్సిపాలిటీల్లో విజయకేతనం ఎగరేసింది. 

02:30 PM (IST) Jan 25

ఇండిపెండెంట్ అభ్యర్థి కోసం... కౌంటింగ్ కేంద్రం వద్ద కోమటిరెడ్డి ఆందోళన

ఇండిపెండెంట్ అభ్యర్థి కాటంరాజు కోసం భువనగిరి కౌంటింగ్ కేంద్రం వద్ద ఇంకా టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల మధ్య ఘర్షణ వాతావరణం కొనసాగుతోంది. తాజాగా కౌంటింగ్ కేంద్రం వద్దకు చేరుకున్న కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పోలీసులతో వాగ్వివాదాని దిగారు. కౌంటింగ్ కేంద్రం వద్దే ధర్నాకు కూర్చోడానికి ప్రయత్నించగా పోలీసులు ఆ ప్రయత్నాన్ని అడ్డుకున్నారు. అయితే ఈ ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో కాటంరాజును పోలీసులు రక్షణ కల్పిస్తున్నారు. 

02:22 PM (IST) Jan 25

వాటివల్లే టీఆర్ఎస్ అఖండ విజయం: గంగుల

తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలే మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ ఈ స్థాయిలో ఘన విజయం అందుకోడానికి కారణమని మంత్రి గంగుల కమలాకర్ అభిప్రాయపడ్డారు. ప్రతిపక్షాలు కనీస పోటీ కూడా ఇవ్వలేకపోయాయన్నారు. ప్రతిపక్ష పార్టీల కంటే టీఆర్ఎస్ రెబల్ అభ్యర్ధులే ఎక్కువ స్థానాల్లో గెలిచారన్నారు. ఈ ఫలితం ద్వారా మరోసారి ప్రజలు తమవెంటే వున్నారని నిరూపితమైందని గంగుల పేర్కొన్నారు. 

02:12 PM (IST) Jan 25

జై కేసీఆర్... మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై కవిత కామెంట్స్

తెలంగాణలో వెలువడిన మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై టీఆర్ఎస్ మాజీ ఎంపీ, సీఎం కేసీఆర్ కూతురు కల్వకుంట కవిత ట్విట్టర్ వేధికన స్పందించారు. ''మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి అఖండ విజయాన్ని అందించిన తెలంగాణ ప్రజలకు ధన్యవాదాలు. ఈ ఎన్నికల్లో విజయం సాధించిన అభ్యర్థులకే కాకుండా పార్టీ గెలుపుకోసం కృషిచేసిన టీఆర్ఎస్ కార్యకర్తలు ప్రతిఒక్కరికి అభినందనలు మరియు శుభాకాంక్షలు. జై తెలంగాణ... జై టీఆర్ఎస్... జై కేసీఆర్.'' అంటూ కవిత ట్వీట్ చేశారు. 

01:44 PM (IST) Jan 25

ఓటమిపాలైన అభ్యర్ధులను గదిలో బందించి... సిరిసిల్లలో పోలీసుల ఓవరాక్షన్

సిరిసిల్లలో పోలీసుల ఓవర్ యాక్షన్ చేస్తూ తమ పట్ల అవమానకరంగా వ్యవహరించారని ఓటమిపాలైన అభ్యర్ధులు వాపోయారు. ఓటమిపాలైన అభ్యర్ధులను కౌంటింగ్ కేంద్రం నుండి బయటకు వెళ్లనివ్వకుండా ఓ గదిలో పెట్టారని అన్నారు. అయితే ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకోకూడదనే తాము ఇలా చేసినట్లు పోలీసులు చెబుతున్నారు. 

01:28 PM (IST) Jan 25

దుబ్బాకలో విచిత్రమైన ఫలితం...

ఉమ్మడి మెదక్ జిల్లా దుబ్బాక మున్సిపాలిటీలో విచిత్రమైన ఫలితం వెలువడింది. ఇక్కడ 20 వార్డులకు గాను 10 వార్డుల్లో ఇండిపెండెంట్లు, 9 వార్డుల్లో టీఆర్ఎస్, 1 చోటు బిజెపి అభ్యర్ధి విజయం సాధించారు. ఇలా ఏ పార్టీకి స్ఫష్టమైన ఆధిక్యం లభించకుండా ఇండిపెండెంట్లు ఆధిక స్థానాలు గెలుచుకున్నారు.