సిరిసిల్ల: సిరిసిల్ల మున్సిపాలిటీ ఫలితాలు తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీ రామారావుకు ఎదురు తిరుగుతున్నాయి. సిరిసిల్ల శాసనసభ నియోజకవర్గానికి కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న విషయం తెలిసిందే.

దాంతో సిరిసిల్లలో టీఆర్ఎస్ క్లీన్ స్వీప్ చేస్తుందని భావించారు. కానీ పరిస్థితి అందుకు అనుగుణంగా లేదు. సిరిసిల్లలో 39 వార్డులు ఉండగా, అన్ని స్థానాల లెక్కింపు పూర్తయింది.. 

సిరిసిల్ల మున్సిపాలిటీలోని 39 వార్డులకు ఓట్ల లెక్కింపు పూర్తయింది. టీఆర్ఎస్ 24 స్థానాలను గెలుచుకోగా, బిజెపి 3, కాగ్రెసు 2 స్థానాలు గెలుచుకుంది. అయితే, పది వార్డులను స్వతంత్రులు గెలుచుకున్నారు. వారంతా టీఆర్ఎస్ రెబెల్స్ అని తెలుస్తోంది. రెబెల్స్ విజయం సాధించినా కూడా వారిని తిరిగి టీఆర్ఎస్ లోకి తీసుకునేది లేదని కేటీఆర్ ఇంతకు ముందు ప్రకటించారు.

మథిర మున్సిపాలిటీలో కాంగ్రెసు నాయకుడు మల్లు భట్టి విక్రమార్క చుక్కలు చూపిస్తున్నారు. కూటమి అభ్యర్థులు ఈ మున్సిపాలిటీలో ముందంజలో ఉన్నారు. మథిర శాసనసభ నియోజకవర్గానికి మల్లు భట్టి విక్రమార్క ప్రాతినిధ్యం వహిస్తున్న విషయ తెలిసిందే. 

మథిర మున్సిపాలిటీలోని మొత్తం 22 వార్డుల్లో కాంగ్రెస్ కేవలం 10 వార్డుల్లోని పోటీ చేయగా, టీడీపీ 7 చోట్ల బరిలో ఉంది. సిపిఐ 2 చోట్ల సిపిఎం 3 చోట్ల పోటీపడింది.

తెలంగాణలోని 120 మున్సిపాలిటీలకు, 9 నగరపాలక సంస్థలకు జరిగిన ఎన్నికల ఫలితాలు శనివారం వెలువడుతున్నాయి. ఈ స్థితిలో టీఆర్ఎస్ తన సత్తాను చాటుతోంది.