హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు శాసనసభా నియోజకవర్గంలో కాంగ్రెసు ఖాతా తెరిచింది. ఇప్పటి వరకు అందిన సమాచారం మేరకు టీఆర్ఎస్ 9 వార్డుల్లో, కాంగ్రెసు ఒక వార్డులో, ఇతరులు 4 వార్డుల్లో గెలిచారు. 

గజ్వెల్ లో మొత్తం 20 వార్డులున్నాయి. గజ్వెల్ రాష్ట్రంలో కీలకమైన నియోజకవర్గం కావడం, సీఎం కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తుండడంతో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. కాంగ్రెసు తన ఉనికిని చాటుకుంది.

ఇదిలావుంటే, మున్సిపల్ ఎన్నికల్లో కారు తన జోరును ప్రదర్శిస్తోంది. ప్రతిపక్షాలుకనీసం పోటీని కూడా ఇవ్వలేని స్థితిలో పడ్డాయి. ఇప్పటి వరకు వెలువడిన ఫలితాల్లో 80కి పైగా మున్సిపాలిటీల్లో టీఆర్ఎస్ తన జెండాను ఎగురేసింది. మొత్తం 120 మున్సిపాలిటీలు ఉన్నాయి. 

120 మున్సిపాలిటీలకు, 9 కార్పోరేషన్లకు జరిగిన ఎన్నికల ఫలితాలు శనివారం వెలువడుతున్నాయి. అత్యధిక మున్సిపాలిటీల్లో, కార్పోరేషన్లలో టీఆర్ఎస్ దూసుకుపోతోంది.