బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో మంగళవారం నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో తెలంగాణకు సంబంధించిన కీలకమైన అంశాలను టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కే.కే, లోక్‌సభ పక్ష నేత నామ నాగేశ్వర రావు లేవనెత్తారు. కేంద్రం నుంచి రావాల్సిన పెండింగ్ నిధులు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. మోడీ సర్కార్ ఫెడరల్ సిస్టంని ఖూనీ చేస్తోందని మండిపడ్డారు.
కేంద్రం తీరుపై టీఆర్ఎస్ మండిపడింది. మోడీ సర్కార్ ఫెడరల్ సిస్టంని ఖూనీ చేస్తోందని టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కే.కే, లోక్‌సభ పక్ష నేత నామ నాగేశ్వర రావు విమర్శలు చేశారు. అఖిలపక్ష సమావేశంలో కేంద్రం తీరుపై అసహనం వ్యక్తం చేశారు. విభజన చట్టంలో ఇచ్చిన హామీల్లో ఇప్పటిదాకా ఒక్కటి కూడా కేంద్రం అమలు చేయలేదని ధ్వజమెత్తారు.
తెలంగాణను శత్రువుగా చూస్తున్నారనీ కేకే, నామ లు కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీశారు. మంగళవారం బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో తెలంగాణకు సంబంధించిన కీలకమైన అంశాలను తెలంగాణ ఎంపీలు లేవనెత్తారు.
కేంద్రం నుండి రాష్ట్రానికి రావాల్సిని పెండింగ్ నిధులు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.ఫెడరల్ సిస్టమ్‌ను కేంద్రం ఖూనీ చేస్తోందని ఎంపీలు నామా నాగేశ్వరరావు, కేకే విమర్శించారు. విభజన చట్టంలో ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా కేంద్రం అమలు చేయలేదని, తెలంగాణ రాష్టాన్ని శత్రువుగా చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
దేశంలో అన్ని రాష్ట్రాలకు మెడికల్ కాలేజీలు మంజూరు చేశారనీ, తెలంగాణకు ఒక్క మెడికల్ కాలేజీ కూడా ఎందుకు ఇవ్వలేదని సూటిగా ప్రశ్నించారు. దేశంలో నిరుద్యోగం పెరిగిపోయిందని, ఉపాధి కల్పనకు కేంద్రం ఎటువంటి చర్యలు తీసుకోవటం లేదని విమర్శించారు. వెనుకబడిన జిల్లాల అభివృద్ధి కోసం ఇవ్వాల్సిన రూ.450 కోట్ల బకాయిలు ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా ఇవ్వడం లేదని నామా, కేకే ఆవేదన వ్యక్తం చేశారు. పార్లమెంటులో ప్రజా సమస్యలపై చర్చ జరగాలని అన్ని పార్టీలు కోరుకుంటున్నాయని తెలిపారు.
