Asianet News TeluguAsianet News Telugu

వినాయక నిమజ్జనం : మినహాయింపులు ఇవ్వకపోతే గందరగోళమే... హైదరాబాద్ స్తంభిస్తుంది..

హుస్సేన్ సాగర్, ఇతర జలాశయంలో పీఓపీ విగ్రహాలను నిమజ్జనంపై నిషేధం ఎత్తివేయాలని…  ట్యాంక్ బండ్ వైపు నుంచి నిమజ్జనానికి అనుమతించాలని… సాగర్ లో కృత్రిమ రంగులు లేని  విగ్రహాలనే అనుమతించాలన్న ఆంక్షలు తొలగించాలని..  హుస్సేన్ సాగర్ లో రబ్బర్ డాం నిర్మించాలన్న ఉత్తర్వులు  సవరించాలని...  పిటిషన్లో జిహెచ్ఎంసి కోరింది.

Telangana moves house motion petition against HC order on PoP Ganesh idol immersion in Hyderabad lakes
Author
Hyderabad, First Published Sep 13, 2021, 10:35 AM IST

హైదరాబాద్ : గణేష్ నిమజ్జనం పై హైకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం రివ్యూ పిటిషన్ దాఖలు చేసింది. తీర్పును పునఃపరిశీలించాలని జిహెచ్ఎంసి కమిషనర్ లోకేష్ కుమార్ పిటిషన్ దాఖలు చేశారు.  తీర్పులో ప్రధానంగా నాలుగు అంశాలు తొలగించాలని కోరారు. 

హుస్సేన్ సాగర్, ఇతర జలాశయంలో పీఓపీ విగ్రహాలను నిమజ్జనంపై నిషేధం ఎత్తివేయాలని…  ట్యాంక్ బండ్ వైపు నుంచి నిమజ్జనానికి అనుమతించాలని… సాగర్ లో కృత్రిమ రంగులు లేని  విగ్రహాలనే అనుమతించాలన్న ఆంక్షలు తొలగించాలని..  హుస్సేన్ సాగర్ లో రబ్బర్ డాం నిర్మించాలన్న ఉత్తర్వులు  సవరించాలని...  పిటిషన్లో జిహెచ్ఎంసి కోరింది.

ట్యాంక్ బండ్ వైపు అనుమతించకపోతే.. నిమజ్జనం పూర్తి కావడానికి ఆరు రోజులు పడుతుందని జిహెచ్ఎంసి పిటిషన్లో పేర్కొంది. వ్యయప్రయాసలతో కూడిన రబ్బర్ డాం నిర్మాణానికి కొంత సమయం అవసరమని వివరించింది. నగర వ్యాప్తంగా మండపాల్లో వేల సంఖ్యలో భారీ విగ్రహాలు ఉన్నాయి. విగ్రహాల సంఖ్యకు తగిన నీటి కుంటలు లేవని విన్నవించింది. పెద్ద విగ్రహాలు నిమజ్జనం చేయడం  కష్టమని... ఇప్పటికే హుస్సేన్ సాగర్ వద్ద ఇతర ఏర్పాట్లు చేశామని వివరించింది. 

ఇందుకోసం నెలలక్రితం ప్రణాళికలు సిద్ధం అని తెలిపింది.  ఇప్పటికిప్పుడు ప్రణాళికలు మార్చితే గందరగోళం తలెత్తుతుందని పేర్కొంది. నిమజ్జనం తర్వాత 24 గంటల్లో వ్యర్ధాలు తొలగిస్తామని కోర్టుకు వెల్లడించింది మాస్కులు ధరించి ప్రజలను చైతన్య పరుస్తూ అని చెప్పింది విగ్రహాలను ఆపితే నిరసనలు చేపడతామని భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి పిలుపునిచ్చింది  అనే జిహెచ్ఎంసి కోర్టుకు తెలిపింది.  హైకోర్టులో మినహాయింపు ఇవ్వకపోతే గందరగోళం తలెత్తుతుందని పేర్కొంది.

నిమజ్జనం తరువాత 24 గంటల్లో వ్యర్థాలు తొలగిస్తామని కోర్టుకు వెల్లడించింది. మాస్కులు ధరించేలా ప్రజలను చైతన్యపరుస్తామని చెప్పింది. విగ్రహాలను ఆపితే నిరసనలు చేపడతామని భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి పిలుపునిచ్చిందని జీహెచ్ఎంసీ కోర్టుకు తెలిపింది. హైకోర్టు మినహాయింపులు ఇవ్వకపోతే గందరగోళం తలెత్తి నగరం స్తంభిస్తుందని పేర్కొంది. 

కాగా, హైదరాబాద్ హుస్సేన్ సాగర్ లో వినాయక విగ్రహల నిమజ్జనంపై హైకోర్టు ఇచ్చిన తీర్పుపై తెలంగాణ సర్కార్ ఆదివారం నాడు హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. 
వినాయక విగ్రహలు, దుర్గామాత విగ్రహల నిమజ్జనం  చేయకూడదని న్యాయవాది వేణుమాధవ్ పిల్ దాఖలు చేశారు.

హుస్సేన్‌సాగర్‌లో వినాయక విగ్రహల నిమజ్జనం: హైకోర్టులో తెలంగాణ సర్కార్ హౌస్ మోషన్ పిటిషన్, రేపు విచారణ

ఈ విషయమై విచారణ నిర్వహించిన హైకోర్టు హుస్సేన్ సాగర్ లో వినాయక విగ్రహల నిమజ్జనంపై ఆంక్షలు విధించింది. ప్లాస్టర్ ఆఫ్ పారిస్ తో తయారు చేసిన వినాయక విగ్రహలను ట్యాంక్ బండ్ లో నిమజ్జనం చేయవద్దని ఆదేశించింది. చిన్న విగ్రహలు, పర్యావరణానికి ఇబ్బంది కల్గించని విగ్రహలను రబ్బర్ డ్యాం ఏర్పాటు చేసి విగ్రహలను నిమజ్జనం చేయాలని హైకోర్టు ఆదేశించింది.

దీంతో హైద్రాబాద్ పోలీసులు గణేష్ నిమజ్జన ఉత్సవ కమిటీకి నోటీసులు జారీ చేశారు. హుస్సేన్ సాగర్ లో  వినాయక విగ్రహలను నిమజ్జనం చేయవద్దని ఆ నోటీసులో పేర్కొన్నారు. అయితే ఈ ఏడాది హుస్సేన్ సాగర్ లో వినాయక విగ్రహల నిమజ్జనాన్ని కొనసాగించేందుకు అనుమతివ్వాలని తెలంగాణ రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ హైకోర్టును కోరారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios