కేరళ వరద బాధితులకు తెలంగాణ ఎమ్మెల్సీలు అండగా నిలిచారు. తెలంగాణకు చెందిన 34 మంది ఎమ్మెల్సీలు తమ నెలజీతాన్ని విరాళంగా ప్రకటించారు. తమ నెల జీతాలకు సంబంధించిన చెక్కును సీఎం కేసీఆర్ కు అందజేశారు.

హైదరాబాద్ : కేరళ వరద బాధితులకు తెలంగాణ ఎమ్మెల్సీలు అండగా నిలిచారు. తెలంగాణకు చెందిన 34 మంది ఎమ్మెల్సీలు తమ నెలజీతాన్ని విరాళంగా ప్రకటించారు. తమ నెల జీతాలకు సంబంధించిన చెక్కును సీఎం కేసీఆర్ కు అందజేశారు. 

కేరళ సీఎం రిలీఫ్ ఫండ్ కు అందజెయ్యాలని కోరారు. మండలి చీఫ్‌విప్ పాతూరి సుధాకర్‌రెడ్డి, విప్ బోడకుంటి వెంకటేశ్వర్లు చెక్ అందజేసిన వారిలో ఉన్నారు. నెలజీతాలు34 మంది ఎమ్మెల్సీలలో 33 మంది టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీలు కాగా ఒక బీజేపీ ఎమ్మెల్సీ ఉన్నారు.