Asianet News TeluguAsianet News Telugu

తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికలు: కోదండరాంకు బిగ్ షాక్

తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీజెఎస్ అధ్యక్షుడు కోదండరామ్ కు భారీ షాక్ తగిలింది. కోదండరాంకు ఎమ్మెల్సీ ఎన్నికల్లో మద్దతు ఇవ్వడానికి ఆరు వామపక్షాలు నిరాకరించాయి. సీపీఐ తన అభ్యర్థిని పోటీకి దించుతోంది.

Telangana MLC elections: A big shock to TJS president Kodandaram
Author
Hyderabad, First Published Oct 13, 2020, 9:07 AM IST

హైదరాబాద్: తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలంగాణ జనసమితి (టీజెఎస్) అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాంకు భారీ షాక్ తగిలింది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో తనకు మద్దతు ఇవ్వాలంటూ కోదండరామ్ చేసిన విజ్ఞప్తిని వామపక్షాలు తిరస్కరించాయి. 

ఆరు వామపక్షాలు నల్లగొండ - వరంగల్- ఖమ్మం గ్రాడ్యుయేట్స్ నియోజకవర్గంలో తమ అభ్యర్థిని పోటీకి దించాలని నిర్ణయించాయి. ఈ నియోజకవర్గం నుంచి కోదండరామ్ పోటీ చేయనున్నారు. ఆ స్థితిలో కోదండరామ్ మీద ఇది తీవ్రమైన ప్రభావం చూపే అవకాశం ఉంది. 

ఇదిలావుంటే, హైదరాబాద్ - రంగారెడ్డి - మహబాబ్ నగర్ గ్రాడ్యుయేట్స్ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న ప్రొఫెసర్ నాగేశ్వర్ కు మద్దతు ఇవ్వాలని వామపక్షాలు నిర్ణయించాయి. 

కోదండరామ్ కు మద్దతు ఇవ్వకుండా నాగేశ్వర్ కు వామపక్షాలు మద్దతు ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. సీపీఎం, సీపీఐ - ఎంఎల్ లిబరేషన్, ఎస్ యూసీఐ (కమ్యూనిస్టు), ఆర్ఎస్పీ, ఫార్వర్డ్ బ్లాక్ నల్లగొండ- వరంగల్ - ఖమ్మం నియోజకవ్రం సీపీఐ అభ్యర్థి జయసారథి రెడ్డికి మద్దతు ఇవ్వాలని నిర్ణయించుకున్నాయి. 

Follow Us:
Download App:
  • android
  • ios