Asianet News TeluguAsianet News Telugu

ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు : కాంగ్రెస్ అవుట్ !!

తెలంగాణలో ఈ నెల 14న జరిగిన రెండు పట్టభద్రుల శాసనమండలి నియోజకవర్గ ఎన్నికలకు సంబంధించి ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. బుధవారం ఉదయం ఎనిమిది గంటలకు కౌంటింగ్ ప్రారంభం అయినా ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఇంకా కొనసాగుతూనే ఉంది. మూడు రోజులైనా ఫలితాలపై ఉత్కంఠ వీడడం లేదు. ఈరోజు శనివారం రాత్రికి తుది ఫలితాలు వెలువడే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.

Telangana mlc election results 2021, congress out - bsb
Author
Hyderabad, First Published Mar 20, 2021, 2:04 PM IST

తెలంగాణలో ఈ నెల 14న జరిగిన రెండు పట్టభద్రుల శాసనమండలి నియోజకవర్గ ఎన్నికలకు సంబంధించి ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. బుధవారం ఉదయం ఎనిమిది గంటలకు కౌంటింగ్ ప్రారంభం అయినా ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఇంకా కొనసాగుతూనే ఉంది. మూడు రోజులైనా ఫలితాలపై ఉత్కంఠ వీడడం లేదు. ఈరోజు శనివారం రాత్రికి తుది ఫలితాలు వెలువడే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.

నల్గొండ - కౌంటింగ్ లైవ్ అప్డేట్
 
67వ అభ్యర్థి రాములు నాయక్ ఎలిమినేట్ అనంతరం అభ్యర్థుల వారీగా వచ్చిన రెండో ప్రాధాన్యత ఓట్లు 

- పల్లా రాజేశ్వర్‌ రెడ్డి (టిఆర్ఎస్) -5252 
- తీన్మార్ మల్లన్న -7352
- కోదండరామ్ -10299 
- అభ్యర్థుల వారీగా ఇప్పటివరకు వచ్చిన ఓట్లు 

- పల్లా రాజేశ్వర్ రెడ్డి 122638
- తీన్మార్ మల్లన్న-99210
-  కోదండరాం -89409
- పల్లా ఆధిక్యం -23428 

- ప్రారంభమైన బిజెపి అభ్యర్థి ప్రేమేందర్రెడ్డి ఎలిమినేషన్ ప్రక్రియ

నల్గొండ ఖమ్మం వరంగల్ ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపులో.. మొదటి ప్రాధాన్యత ఓట్లు లో ఎవరికీ సరైన మెజారిటీ రాకపోవడంతో రెండో ప్రాధాన్యత ఓట్లను లెక్కిస్తున్న సంగతి తెలిసిందే. రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో పల్లా మెజారిటీ తగ్గింది. అయితే ఇప్పటికి కూడా రాజేశ్వర్రెడ్డి 25,528 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. మొదటి, రెండో ప్రాధాన్యత కలిగిన పల్లా రాజేశ్వర్ రెడ్డి కి 1,17,386 ఓట్లు రాగా.. మొదటి, రెండో ప్రాధాన్యత కలిపి తీన్మార్‌ మల్లన్నకు 91,858 ఓట్లు రాగా.. మొదటి, రెండో ప్రాధాన్యత కలిపి కోదండరామ్‌కు 79,110 ఓట్లు వచ్చాయి. ఇప్పటివరకు 66 మందికి సంబంధించిన ఎలిమినేషన్ ప్రక్రియ పూర్తయ్యింది. 

హైదరాబాద్‌-రంగారెడ్డి-మహబూబ్‌నగర్‌ ఎమ్మెల్సీ రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు కొనసాగుతుంది. టీఆర్‌ఎస్‌ అభ్యర్థి వాణీదేవి 8,478 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఇప్పటి వరకు వాణీదేవికి 1,15,043 ఓట్లు, రామచంద్రరావు (బీజేపీ) 1,06,565 ఓట్లు ప్రొ. నాగేశ్వర్‌కు 55,742 ఓట్లు, చిన్నారెడ్డి (కాంగ్రెస్‌) 32,879 ఓట్లు వచ్చాయి. ఇప్పటివరకు 86 మందికి సంబంధించి ఎలిమినేషన్‌ ప్రక్రియ పూర్తయ్యింది.

నల్గొండ ఖమ్మం వరంగల్ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది మొదటి ప్రాధాన్యత ఓట్లు లెక్కింపు పూర్తయింది ఎవరికీ గెలుపు కావలసిన మ్యాజిక్ ఫిగర్ అవ్వకపోవడం ఎవరికి గెలుపు గెలుపు కావలసిన మ్యాజిక్ ఫిగర్ రాకపోవడంతో రెండో ప్రాధాన్యత ఓటును లెక్కిస్తున్నారు రెండో ప్రాధాన్యత ఈ ఓటర్ లో కూడా ఎవరికీ స్పష్టమైన మెజారిటీ వచ్చే అవకాశం కనిపించడం లేదు ఒకవేళ ఎవరికీ మ్యాజిక్ ఫిగర్ రాకపోతే ఎక్కువ ఓట్లు వచ్చిన అభ్యర్థిని విజేతగా ప్రకటిస్తారు

హైదరాబాద్ రంగారెడ్డి మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు 

- కొనసాగుతున్న రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు 
- రెండో ప్రాధాన్యత లో 14 మంది ఎలిమినేషన్ ప్రక్రియ పూర్తయింది 
- రెండో ప్రాధాన్యత రెండో ప్రాధాన్యత లో టిఆర్ఎస్ 38, బిజెపి 17, కాంగ్రెస్ 13 ఓట్లు 
- రెండో ప్రాధాన్యత ఓట్లతో కలిపి వాణి దేవి (టిఆర్ఎస్) ఆధిక్యం  8,042 
- వాణి దేవి (టిఆర్ఎస్) కి 1,12,727ఓట్లు రాగా, రామచంద్రారావు (బీజేపీ)కి 1,04,685 ఓట్లు 
- ప్రొఫెసర్ నాగేశ్వరరావు కు 53,628 ఓట్లు, చిన్నారెడ్డి (కాంగ్రెస్‌)కి 31,567 ఓట్లు 

- హైదరాబాద్ రంగారెడ్డి మహబూబ్ నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు ఏడో రౌండ్ పూర్తి 

- ఏడో రౌండ్ పూర్తయ్యేసరికి ఏడో రౌండు పూర్తయ్యేసరికి వాణి దేవి (టిఆర్ఎస్) కి 1,12,689  ఓట్లు 
- రామచంద్రరావు (బీజేపీ) 1,04,668 ఓట్లు, ప్రొ. నాగేశ్వర్‌కు 53,610 ఓట్లు
- ఏడో రౌండ్‌ పూర్తయ్యేసరికి చిన్నారెడ్డి(కాంగ్రెస్‌)కి 31,554 ఓట్లు
- మ్యాజిక్‌ ఫిగర్‌ను చేరుకోని మొదటి ప్రాధాన్యత ఓట్లు
-  అనివార్యమైన రెండో ప్రాధాన్యత ఓట్లపైనే టీఆర్‌ఎస్‌, బీజేపీ ఆశలు
- మొదటి ప్రాధాన్యత ఓట్లలో వాణీదేవి(టీఆర్‌ఎస్‌) ఆధిక్యం 8,021 ఓట్లు
- ఏడు రౌండ్లలో మొత్తం చెల్లని ఓట్లు 21,309

ఇక నల్లగొండ స్థానంలో మొత్తం 5,05,525 ఓట్లకు గాను 3,86,320(76.41%) ఓట్లు పోలయ్యాయి. హైదరాబాద్ స్థానంలో 5,31,268 ఓట్లకు గాను  3,57,354 (67.25%) ఓట్లు పోలయ్యాయి. హైదరాబాద్ స్థానం నుంచి 93 మంది అభ్యర్థులు పోటీ పడగా ప్రధాన పోటీ సురభి వాణీదేవి (టీఆర్‌ఎస్‌), రామచంద్రరావు (బిజెపి), మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కె.నాగేశ్వరరావు (ఇండిపెండెంట్) మధ్య నెలకొంది. నల్లగొండ స్థానం నుంచి 71 మంది అభ్యర్థులు బరిలో నిలవగా ప్రధాన పోటీ రాజేశ్వర్ రెడ్డి (టిఆర్ఎస్), ప్రొఫెసర్ ఎం.కోదండరాం (టీజేఎస్‌)  మధ్య నెలకొంది

ఎమ్మెల్సీ ఓట్లను ఎలా లెక్కిస్తారంటే..
కౌంటింగ్ కోసం ఒక్కో హాల్లో 7 టేబుళ్ల చొప్పున ఎనిమిది హాల్లలో మొత్తం 56 టేబుళ్లు ఏర్పాటు చేశారు. ప్రతి రౌండ్ లో ఒక్కో టేబుల్ కు వెయ్యి ఓట్ల చొప్పున 56 వేల ఓట్లను లెక్కించనున్నారు. పోలింగ్ కేంద్రాల నుంచి వచ్చిన బ్యాలెట్ పేపర్ లను కలిపేసి 25 ఓట్ల చొప్పున ఒక బండిలు చేశాక, ఒక్కో టేబుల్ కు వెయ్యి ఓట్లు (40 బండిళ్లు) ఇచ్చి  లెక్కిస్తారు. అంటే ఒక రౌండ్ కు 56 వేల చొప్పున ఓట్లను లెక్కిస్తారు. మొదటి ప్రాధాన్యత ఓట్లు లెక్కింపు పూర్తి కావడానికి కనీసం పది నుంచి పన్నెండు గంటల సమయం పడుతుందని చెబుతున్నారు.

ఫస్ట్ ప్రయారిటీ ఓట్ల లెక్కింపు సమయంలో నే చెల్లని ఓట్లను పక్కన పెట్టి, వాటి లెక్క కూడా తీస్తారు. మొత్తం పోలైన ఓట్లలో చెల్లని ఓట్లు తీసేసాకే అభ్యర్థి గెలుపునకు అవసరమైన కోటను నిర్ణయిస్తారు. ఆ కోటా మేరకు ఎవరికైనా మొదటి ప్రాధాన్యత ఓట్లు వచ్చినట్లయితే విజేతగా ప్రకటించి కౌంటింగ్ నిలిపివేస్తారు. ఒక్కో రౌండ్ కు 56 వేల ఓట్లు చొప్పున మొదటి ప్రాధాన్యత ఓట్లు లెక్కించేందుకు ఏడు రౌండ్లు పట్టనుంది.  గెలవడానికి సరిపడా మొదటి ప్రాధాన్యత ఓట్లు ఎవరికీ రాకపోతే రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు మొదలు పెడతారు.

Follow Us:
Download App:
  • android
  • ios