సాంకేతిక కారణాలతోనే ఈ దఫా బడ్జెట్ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగం ఉండదని తెలంగాణ రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్ రె్డ్డి చెప్పారు.
హైదరాబాద్: టెక్నికల్ కారణాలతోనే ఈ దఫా బడ్జెట్ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగం లేదని తెలంగాణ రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి చెప్పారు.
తెలంగాణ రాష్ట్ర మంత్రిVemula Prashanth Reddy మంగళవారం నాడు టీఆర్ఎస్ శాసనసభపక్ష కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. Telangana Assembly Budget సమావేశాలు హుందాగా నిర్వహిస్తామన్నారు. 2021 లో 8వ అసెంబ్లీ సమావేశాలు జరిగాయన్నారు. అయితే ఈ సమావేశాలు జరిగిన తర్వాత అసెంబ్లీ ప్రోరోగ్ కాలేదని ఆయన గుర్తు చేశారు. ఈ నెల 7వ తేదీ నుండి జరిగే సమావేశాలు 8వ సమావేశాలకు కొనసాగింపు మాత్రమేనని మంత్రి వివరించారు.
Telangana వృద్ది రేటు దేశంలోనే నెంబర్ వన్ గా ఉందని కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన గణాంకాలు చెబుతున్నాయని మంత్రి గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్రం అభివృద్దిలో ముందుకు సాగుతుంటే BJP నేతలు మాత్రం రాష్ట్రంలో అభివృద్ది లేదని చెప్పడం హాస్యాస్పదంగా ఆయన పేర్కొన్నారు. తాము చేసిన అభివృద్దిని గవర్నర్ ద్వారా చెప్పించాలని కోరుకొంటామన్నారు. కానీ టెక్నికల్ సమస్యలతో ఈ దఫా గవర్నర్ ప్రసంగం లేదని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి చెప్పారు. అసెంబ్లీ ప్రోరోగ్ కాకపోవడం వల్లే ఈ దఫా బడ్జెట్ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగం ఉండదని మంత్రి వివరించారు. అయితే ప్రతి బడ్జెట్ సమావేశాలను గవర్నర్ ప్రారంభించాలనే నియమం లేదన్నారు. ప్రతి క్యాలెండర్ ఇయర్ లో కొత్త సెషన్స్ మాత్రమే Governor ప్రారంభించాలనేది నిబంధన అని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి చెప్పారు. ఈ నెల 7వ తేదీ నుండి జరిగే బడ్జెట్ సమావేశాలు ఈ ఏడాదిలో జరిగే కొత్త సమావేశాలు కావని మంత్రి తేల్చి చెప్పారు. ఈ కారణంగానే గవర్నర్ ప్రసంగం ఉందని ఆయన వివరించారు. అసెంబ్లీ సమావేశాలు Prorogue కాకపోవడం వల్లే గవర్నర్ ప్రసంగం లేదని చెప్పారు. ఒకవేళ ప్రోరోగ్ కాని సమావేశాలకు గవర్నర్ ప్రసంగం ఉంటే అదే రాజ్యాంగబద్దంగా తప్పు అవుతుందని మంత్రి ప్రశాంత్ రెడ్డి తెలిపారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఈ తరహలోనే గవర్నర్ ప్రసంగం లేకుండానే బడ్జెట్ సమావేశాలు జరిగిన విషయాన్ని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి గుర్తు చేశారు. మరో వైపు Parliament ఉభయ సభల్లో రాష్ట్రపతి ప్రసంగం లేకుండానే పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల కూడా గతంలో నిర్వహించిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు. ఇదిలా ఉంటే రాష్ట్రపతి ప్రసంగం లేకుండానే 2004లో బడ్జెట్ సమావేశాలు నిర్వహించడంపై సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్ ను ఉన్నత న్యాయస్తానం కొట్టివేసిన విషయాన్ని మంత్రి మీడియాకు చూపారు.
గవర్నర్ ప్రసంగం లేకుండానే బడ్జెట్ సమావేశాలు నిర్వహిస్తున్నారని తమపై విపక్షాలు చేస్తున్న విమర్శలను ఆయన కొట్టిపారేశారు. టెక్నికల్ అంశాలు తెలియకుండానే విపక్షాలు విమర్శలు చేయడాన్ని మంత్రి ప్రశాంత్ రెడ్డి తప్పు బట్టారు.
అనేక రాష్ట్రాల్లో రాజ్యాంగ ఉల్లంఘన చేసింది బీజేపీ. రాజ్యాంగ ఉల్లంఘనల గురించి బీజేపీ నేతలు మాట్లాడడం దయ్యాలు వేదాలు ఒల్లించడమేనన్నారు,. గోవా, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, పాండిచ్చేరి, కర్ణాటకల్లో పరిణామాలను కూడా మంత్రి వివరించారు.
పార్లమెంట్ లో పాసైన తెలంగాణ బిల్లుపై పార్లమెంట్ లో వ్యతిరేకంగా మాట్లాడింది మోడీయేనని మంత్రి గుర్తు చేశారు. తెలంగాణ అభివృద్దిని అడ్డుకొంటున్న మోడీని బీజేపీ నేతలు నిలదీయాలని ఆయన కోరారు.
దేశంలోని మాతృమూర్తులు బాధపడే విధంగా Assam సీఎం Himanta Biswa Sarma మాట్లాడారని మంత్రి Harish Rao గుర్తు చేశారు.Bandi Sanjay అవగాహన లేకుండా మాట్లాడుతున్నారన్నారు. గవర్నర్ మహిళా కాబట్టే ఆమెను అవమానించారని బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలను హరీష్ రావు తప్పు బట్టారు. అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ వ్యాఖ్యలను సమర్ధించిన బండి సంజయ్ కు తమను విమర్శించే హక్కు లేదన్నారు. గుజరాత్ సీఎంగా నరేంద్ర మోడీ ప్రమాణం చేసిన వెంటనే అప్పటి గవర్నర్ కమలాబేణిని డిస్మిస్ చేయించారని హరీష్ రావు గుర్తు చేశారు. బెంగాల్ సీఎం మమత బెనర్జీ కూడా మహిళే. అయితే రాజ్ భవన్, గవర్నర్ ను అడ్డు పెట్టుకొన బెంగాల్ సీఎం Mamata Banerjeeని అవమానించడం లేదా అని హరీష్ రావు ప్రశ్నించారు.
బేటీ బచావో బేటీ పడావో అనే కార్యక్రమానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన నిధుల్లో 80 శాతం ప్రధాని ప్రచారం కోసం ఖర్చు చేస్తే పథకం కోసం 20 శాతం ఖర్చు చేశారని హరీష్ రావు విమర్శించారు.ఈ విషయమై పార్లమెంటరీ కమిటీ నివేదికను హరీష్ రావు మీడియాకు చూపారు.
రాజ్‌భవన్ కు కాషాయ రంగు, బీజేపీ రంగు పులుముతున్నారని మంత్రి హరీష్ రావు విమర్శించారు.గవర్నర్ వ్యవస్థను అడ్డు పెట్టుకొని రాష్ట్రాలను ఇబ్బంది పెడుతున్నారని బీజేపీ నేతల తీరుతో తేట తెల్లమైందన్నారు. గవర్నర్ కు ఏమైనా ఇబ్బంది ఉంటే సీఎంఓ లేదా సచివాలయంతో ఈ విషయమై మాట్లాడేదని హరీష్ రావు చెప్పారు. పార్టీలో అంతర్గత విబేధాలను పరిష్కరించుకోవాలని మంత్రి హరీష్ రావు బండి సంజయ్ కు హితవు పలికారు.
