హైదరాబాద్: ఆర్టీసీ సమ్మెపై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. కొందరు యూనియన్ లీడర్ల అత్యుత్సాహం వల్లే ఆర్టీసీలో సమ్మె జరుగుతుందని ఆరోపించారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ రైల్వేను ప్రైవేటీకరిస్తూ ఆర్టీసీపై మాట్లాడుతారా అంటూ మండిపడ్డారు. 

ఆర్టీసీ సమ్మెపై గొంతు చించుకుంటున్న బీజేపీ, కాంగ్రెస్ నేతలు వాళ్లు పాలిస్తున్న రాష్ట్రాల్లో ఆర్టీసీని విలీనం చేశారా అని ప్రశ్నించారు. ఆర్టీసీ కార్మికులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తే కుదరదని తలసాని శ్రీనివాస్ హెచ్చరించారు. 

టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తే తమ మేనిఫెస్టోలో ఆర్టీసీ విలీనం చేస్తామని చెప్పామా అంటూ నిలదీశారు. సోషల్ మీడియాలో ఇష్టమొచ్చినట్టు పోస్టులు పెడితే చర్యలు తప్పవని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ హెచ్చరించారు.