Asianet News TeluguAsianet News Telugu

తప్పుగా మాట్లాడలేదు, కానీ.. గంగపుత్రులకి క్షమాపణలు చెబుతా: తలసాని

కొత్త రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్‌ నాయకత్వంలో అన్ని వర్గాల ప్రజల అభివృద్ధి కోసం ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. కోకాపేటలో జరిగిన ముదిరాజ్‌ భవన్‌ శంకుస్థాపన కార్యక్రమంలో తాను గంగపుత్రులను బాధపెట్టేలా ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని మంత్రి స్పష్టం చేశారు.   

telangana minister talasani srinivas yadav ready for apology over remarks against gangaputras ksp
Author
Hyderabad, First Published Jan 17, 2021, 2:36 PM IST

కొత్త రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్‌ నాయకత్వంలో అన్ని వర్గాల ప్రజల అభివృద్ధి కోసం ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్.

కోకాపేటలో జరిగిన ముదిరాజ్‌ భవన్‌ శంకుస్థాపన కార్యక్రమంలో తాను గంగపుత్రులను బాధపెట్టేలా ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని మంత్రి స్పష్టం చేశారు.  తన వ్యాఖ్యలు ఏమైనా తప్పుగా ఉన్నాయని భావిస్తే గంగపుత్రులకు క్షమాపణలు చెప్పేందుకు సిద్ధంగా ఉన్నానని తలసాని ప్రకటించారు.

దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుంచి గంగపుత్రుల సంక్షేమం, అభివృద్ధి పట్టించుకున్న వారు లేరని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో మత్స్యకార సొసైటీలలో వివిధ వర్గాల వారు సభ్యులుగా ఉన్నారని శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు.

మత్స్యకార వృత్తిపై ఆధారపడి జీవనం సాగిస్తున్న గంగపుత్రులు, బెస్త, ముదిరాజ్‌లకు మేలు చేయాలన్నది కేసీఆర్ ఉద్దేశమని ఆయన పేర్కొన్నారు.

 కాగా,  ‌ఇటీవ‌ల‌ ఓ కార్య‌క్ర‌మంలో త‌మ‌ పట్ల మంత్రి తలసాని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని, వెంటనే ఆయనను రాష్ట్ర‌ మంత్రి పదవి నుంచి తొల‌గించా‌ల‌ని అఖిల భారత గంగపుత్ర సంఘం డిమాండ్ చేస్తోంది.

ఆయ‌న వ్యాఖ్యలు కులాల మధ్య చిచ్చు పెట్టేలా ఉన్నాయని ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తోంది. ఈ నేప‌థ్యంలోనే త‌ల‌సాని వీడియో విడుద‌ల చేశారు.

Follow Us:
Download App:
  • android
  • ios