Asianet News TeluguAsianet News Telugu

హైద్రాబాద్‌లో చేపమందు పంపిణీ ప్రారంభించిన తలసాని: 32 కౌంటర్లు ఏర్పాటు

 హైద్రాబాద్  నాంపల్లి  ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో చేప మందు పంపిణీని  మంత్రి తలసాని యాదవ్  ఇవాళ  ప్రారంభించారు.  చేప మందు  పంపిణీకి  ప్రభుత్వం పెద్ద ఎత్తున  ఏర్పాట్లు  చేసింది.

  Telangana  Minister  Talasani  Srinivas Yadav  begins  Fish Medicine  Distribution in Hyderabad  lns
Author
First Published Jun 9, 2023, 9:39 AM IST

హైదరాబాద్:  నగరంలోని  నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో ఆస్తమా  రోగులకు   చేపమందు పంపిణీని  శుక్రవారంనాడు  తెలంగాణ రాష్ట్ర మంత్రి  తలసాని  శ్రీనివాస్ యాదవ్  ప్రారంభించారు.  కరోనా కారణంగా గత మూడేళ్లుగా  అస్తమా  రోగులకు  బత్తిన సోదరులు  పంపిణీ  చేసే  చేపమందును నిలిపివేశారు.  మూడేళ్ల తర్వాత  చేపమందు  పంపిణీ కార్యక్రమాన్ని  ఇవాళ  ప్రారంభించారు.   మూడేళ్ల తర్వాత  చేపమందు  పంపిణీ  ప్రారంభం కావడంతో  పెద్ద ఎత్తున  ప్రజలు  చేరుకున్నారు. మూడు  రోజులుగా   చేపమందు కోసం  వచ్చిన ప్రజలు క్యూలైన్లలో వేచి  ఉన్నారు. దేశ వ్యాప్తంగా  పలు  రాష్ట్రాల నుండి  ఆస్తమా రోగులు  చేపమందు కోసం వస్తారు.

హైద్రాబాద్ లో  బత్తిన  హరినాథ్ గౌడ్  కుటుంబం  178 ఏళ్ల నుండి చేప మందును పంపిణీ  చేస్తుంది. మృగశిర కార్తె  రోజున చేప మందు పంపిణీని ప్రారంభించడం  బత్తిన హరినాథ్ గౌడ్  కుటుంబం  నిర్వహిస్తుంది.  

కరోనా కారణంగా మూడేళ్ల నుండి  చేపమందు  పంపిణీని నిలిచిపోయింది. ఈ ఏడాది  కరోనా తగ్గుముఖం పట్టడంతో  చేపమందు పంపిణీకి ప్రభుత్వం అనుమతిని  ఇచ్చింది.   రెండు వారాల క్రితం  తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తో  బత్తిన హరినాథ్ గౌడ్  కుటుంబసభయులు సమావేశమయ్యారు.  చేపమందు పంపిణీకి సంబంధించిన ఏర్పాట్ల గురించి మంత్రితో చర్చించారు.  నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో  చేపమందు పంపిణీకి  ఏర్పాట్లు చేయాలని  మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్  అధికారులను ఆదేశించారు. మూడు  రోజుల క్రితం  ఎగ్జిబిషన్  గ్రౌండ్స్ లో  చేపమందు  పంపిణీ  ఏర్పాట్లను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్  పరిశీలించారు.

సుమారు  ఐదు లక్షల మందికి  చేపమందు  పంపిణీ  చేసేందుకు  ఏర్పాట్లు  చేశారు. ఎగ్జిబిషన్  గ్రౌండ్స్ లో చేపమందు  పంపిణీ కోసం  32 కౌంటర్లు  ఏర్పాటు  చేశారు.  చేపమందు కోసం వచ్చే వారి కోసం 24 క్యూలైన్లను ఏర్పాటు  చేశారు. వృద్ధులు,  పిల్లల కోసం  ప్రత్యేక క్యూ లైన్లను  ఏర్పాటు  చేశారు.

also read:ఎల్లుండి నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో చేపమందు పంపిణీ: ఏర్పాట్లను పరిశీలించిన తలసాని

200 మంది బత్తిన హరినాథ్ గౌడ్ కుటుంబ సభ్యులు  చేపమందును  పంపిణీ  చేయనున్నారు. వీరితో పాటు  కొందరు వాలంటీర్లు  కూడ   చేపమంది పంపిణీ చేస్తున్నారు.చేపమందు పంపిణీ కోసం  రెండున్నర లక్షల కొర్రమీను చేపలను  సిద్దం  చేశారు.ఇవాళ, రేపు చేపమందును పంపిణీ  చేయనున్నారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios