విశాఖపట్టణం: విశాఖ శారదాపీఠంలో నిర్వహించిన వార్షికోత్సవం ముగింపు కార్యక్రమంలో సోమవారం నాడు  తెలంగాణ రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు. విశాఖ శారదా పీఠంలో  ఏపీ సీఎం వైఎస్ జగన్ తో పాటు ఏపీకి చెందిన కొందరు మంత్రులు, వైసీపీకి చెందిన ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

Also read:విశాఖ శారదా పీఠం వార్షికోత్సవంలో పాల్గొన్న సీఎం జగన్

శారదా పీఠం వార్షికోత్సవం ముగింపు కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర  సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు. శారదా పీఠంలో పూర్ణాహుతి కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్తున్న సీఎం జగన్‌ను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్  వెనుక నుండి పిలిచారు. తలసాని పిలవడంతో జగన్ వెనక్కు తిరిగి ఆయనను చూసి చిరునవ్వు నవ్వారు.

మరో వైపు  శారదా పీఠంలో జరిగిన కార్యక్రమం సందర్భంగా పలువురికి శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర స్వామి పలువురికి శాలువాలు కప్పి సన్మానించారు. ఈ సమయంలో తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌  స్వరూపానందేంద్రస్వామి వద్దకు చేరుకొన్నారు. 

ఈ సమయంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌ను చూపుతూ జగన్ కు స్వరూపానందేంద్రస్వామి ఏదో చెప్పడం కన్పించింది. ఈ సమయంలో కూడ జగన్ చిరునవ్వు నవ్వారు. స్వామి ఆశీర్వాదం తీసుకొన్న తర్వాత తలసాని శ్రీనివాస్ యాదవ్  అక్కడి నుండి వెళ్లిపోయారు.