హైదరాబాద్: ఏషియన్ షూటింగ్ ఛాంపియన్ షిప్ లో పతకాలు సాధించిన షూటర్ అబిద్ అలీ ఖాన్ కు శంషాబాద్ విమానాశ్రయంలో ఘన స్వాగతం పలికారు రాష్ట్ర క్రీడల శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్. 

ఖత్తర్ నుండి తెలంగాణ కు వచ్చిన షూటర్ అబిద్ అలీ ఖాన్ ను రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ శంషాబాద్ విమానాశ్రయంలో స్వాగతం పలికి, పుల బొకే ఇచ్చి తెలంగాణ ప్రభుత్వం తరపున అభినందనలు తెలిపారు. 

ఖత్తర్ లో నవంబర్ 3 నుంచి 14వరకు జరిగిన 14వ ఏషియన్ షూటింగ్ షిప్ లో భాగంగా తెలంగాణ నుంచి పథకాలు సాధించిన ఐదుగురు క్రీడాకారులకు అభినందనలు తెలిపారు. మెడల్స్ సాధించిన ఇషా సింగ్, ధనుష్ శ్రీకాంత్, అబిద్ అలీ ఖాన్, రుద్రరాజులకు మంత్రి శ్రీనివాస్ గౌడ్ ధన్యవాదాలు తెలిపారు.

ఏషియన్ షూటింగ్ ఛాంపియన్ షిప్ పోటీలలో ఐదుగురు మెడల్స్ సాధించడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఇకపై షూటింగ్ లకు ప్రత్యేక శిక్షణ ఇచ్చేలా చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి తెలిపారు.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుండి క్రీడాకారులకు ఆర్థికంగా సహాయ సహకారాలు అందచేస్తామని హామీ ఇచ్చారు. క్రీడాకారులు రాష్ట్రానికి మంచి పేరు ప్రఖ్యాతలు తీసుకు రావాలని ఆకాంక్షించారు.  

అన్ని రంగాల్లో తెలంగాణ రాష్ట్రం ముందంజలో ఉండాలన్నదే ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యమని చెప్పుకొచ్చారు. ప్రతీ క్రీడాకారుడిని ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని తెలిపారు. క్రీడాకారులు కూడా రాష్ట్రంయెక్క కీర్తిని ప్రపంచానికి చాటి చెప్పాలని మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆకాంక్షించారు.