రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌లో తెలంగాణ యువజన వ్యవహారాలు, పర్యాటక, ఎక్సైజ్, క్రీడల శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఎస్కార్ట్ వాహనం ఓ చిన్నారిని ఢీకొట్టింది. అయితే వెంటనే చుట్టుపక్కల వారు అప్రమత్తం కావడంతో పాపకు ఎలాంటి అపాయం కలగలేదు. 

మంత్రి కాన్వాయ్‌లోని ఎస్కార్ట్ వాహనం రివర్స్ తీసుకుంటున్న సమయంలో.. కారు డ్రైవర్ పాపను గమనించలేదు. వాహనం చిన్నారిని ఢీకొట్టడంతో ఆమె కిందపడిపోయింది. వెంటనే అప్రమత్తమైన స్థానికులు బాలికను కాపాడారు. వాహనం చాలా తక్కువ వేగంలోనే ఉండటంతో చిన్నారికి ఏం కాలేదు.