సాయిచంద్ భార్య రజినికి ఆర్ధిక సహాయం: రూ.కోటి చెక్ అందించిన సబితా

దివంగత సాయిచంద్  భార్య రజినికి బీఆర్ఎస్ పార్టీ కోటి రూపాయాలను అందించింది.

Telangana Minister  Sabitha Indra Reddy  Gives   1 crore  Rupees To Saichand Wife  Rajini

హైదరాబాద్:  దివంగత సాయిచంద్  భార్య రజినికి బీఆర్ఎస్ పార్టీ  కోటి రూపాయాలను అందించింది.  సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు  బీఆర్ఎస్ పార్టీ తరపున  కోటి రూపాయాల చెక్ ను తెలంగాణ మంత్రి సబితా ఇంద్రారెడ్డి,  ఇబ్రహీంపట్టణం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డిలు  ఇవాళ  అందించారు.

బడంగ్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని గుర్రంగూడలో దివంగత మాజీ గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్,సాయిచంద్  కుటుంభ సభ్యులను ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారు,జడ్పీ చైర్ పర్సన్ అనిత రెడ్డి , దాసోజు శ్రవణ్ గార్లతో కలిసి పరామర్శించారు విద్యా శాఖ మంత్రి  సబితా ఇంద్రారెడ్డి .సాయిచంద్ సతీమణి, రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ చైర్ పర్సన్ రజినికి కోటి రూపాయల చెక్కును అందించారు మంత్రి సబితా ఇంద్రారెడ్డి.

 ముఖ్యమంత్రి కేసీఆర్  ఆదేశాలతో కోటి రూపాయల చెక్కును అందించినట్లు తెలిపారు. తెలంగాణ ప్రజల గుండె చప్పుడుగా సాయిచంద్ నిలిచారని అన్నారు.సాయిచంద్ కుటుంబానికి ముఖ్యమంత్రి కేసీఆర్  మొత్తం కోటి యాభై లక్షల ఆర్థిక సహాయం అందిస్తున్నట్లు తెలిపారు. కోటి రూపాయలు రజినికి,మరో 50 లక్షలు సాయిచంద్ తల్లిదండ్రులు, సోదరికి అందిస్తున్నట్లు తెలిపారు.

భర్తను కోల్పోయిన రజిని బాధ తనకు తెలుసని మంత్రి  సబితా ఇంద్రారెడ్డి  చెప్పారు.సాయిచంద్ మరణం అత్యంత బాధాకరమన్నారు.  సాయిచంద్ కుటుంబానికి అండగా నిలిచిన ముఖ్యమంత్రి కేసీఆర్ కి మంత్రి ధన్యవాదాలు తెలిపారు.

బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు దాసోజు శ్రవణ్  మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో మొదటి పాట సాయిచంద్ పాడితే, ఆ తర్వాతి మాట కేసీఆర్ ది సాయిచంద్ మరణం తీరని లోటన్నారు.ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి మాట్లాడుతూ ఉద్యమ కాలంలో సాయిచంద్ లేని సభ లేదన్నారు.సాయిచంద్ పాట చిరస్థాయిగా నిలిచిపోతుందన్నారు.

దివంగత సాయిచంద్  సతీమణి రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ రజిని  మాట్లాడుతూ  ఒక కళను  విశ్వ వ్యాప్తం కావటానికి ఒక శక్తి లాగా కేసీఆర్  నిలిచారని సాయిచంద్ తరుచూ తనతో చెబుతుండేవారని ఆమె గుర్తు చేశారు.తమ కుటుంబానికి పూర్తి అండగా ఉన్న కేసీఆర్ కి ఆమె ధన్యవాదాలు చెప్పారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios