హైదరాబాద్: పేదవాడి స్వంత ఇంటి కలను నేరవేర్చడమే సీఎం కేసీఆర్ లక్ష్యమని తెలంగాణ రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి చెప్పారు.

శుక్రవారం నాడు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి హైద్రాబాద్ సమీపంలో నిర్మిస్తున్న  డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను పరిశీలించారు.కొల్లూరు లో డబుల్ బెడ్ రూమ్ లో ప్రాజెక్టు డిజైన్లను పరిశీలించారు. అధికారులు సమన్వయంతో పనిచేయడం వల్లే ఇది సాధ్యమైందని ఆయన అభిప్రాయపడ్డారు. 

124 ఎకరాల్లో దాదాపు 15 వేల ఇళ్లను రూ. 200 కోట్లతో నిర్మిస్తున్నట్టుగా మంత్రి చెప్పారు. ఇప్పటికే 90 శాతం పనులు పూర్తైనట్టు మంత్రి తెలిపారు.హౌసింగ్ సెక్టార్లో ఇదొక ఛాలెంజ్ అని మంత్రి చెప్పారు. పేదలకు స్వంత ఇంటి కలను నెరవేర్చేందుకు సీఎం కేసీఆర్ డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణాన్ని చేపట్టారని ఆయన చెప్పారు.