పోతిరెడ్డిపాడు సామర్ధ్యం పెంచినా నోరు మెదపలేదు: కాంగ్రెస్ కు మంత్రి నిరంజన్ రెడ్డి కౌంటర్


ప్రకృతి విపత్తును కూడా తమ రాజకీయ అవసరాలకు విపక్షాలు వాడుకొంటున్నాయని తెలంగాణ రాష్ట్ర వ్యసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో  లోపం లేదన్నారు. అవగాహన లేకుండానే విపక్షాలు ఆరోపనలు చేస్తున్నాయన్నారు. 

 Telangana Minister niranjan Reddy Reacts on Congress comments

హైదరాబాద్: తెలంగాణకు అన్యాయం చేసే పోతిరెడ్డిపాడు సామర్ధ్యాన్నిఉమ్మడి ఏపీ సీఎం  వైఎస్ఆర్ పెంచినా కూడా  తెలంగాణ కాంగ్రెస్ నేతలు నోరు మూసుకున్నారని మంత్రి  Singireddy Niranjan Reddy  ప్రశ్నించారు. 

ఆదివారం నాడు Hyderabad  లో  రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. Kaleshwaram Project కు చెందిన పంప్ హౌస్ వరద నీటిలో ముంపునకు గురి కావడంపై విపక్షాల విమర్శలకు మంత్రి సమాధానం ఇచ్చారు. 

కాళేశ్వరానికి విపక్షాల సర్టిఫికెట్ అవసరం లేదన్నారు. ఈ ప్రాంత రైతులు, ప్రజలే  కాళేశ్వరం ప్రాజెక్టుకు సర్టిపికెట్ ఇస్తారన్నారు. కాళేశ్వరం నుండి ఒక్క ఎకరాకు నీళ్లు ఇవ్వలేదని విపక్షాల విమర్శలను తప్పుబట్టారు. కాళేశ్వరానికి ఇప్పటి వరకు ఖర్చు చేసింది 95 వేల కోట్లు అయితే రెండు లక్షల కోట్ల అవినీతి జరిగిందని నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని మంత్రి మండిపడ్డారు.

500 ఏళ్ల తర్వాత గోదావరి నదికి  వచ్చిన  తీవ్ర వరదలు అని కేంద్ర జలసంఘం వెల్లడించిన విషయాన్ని మంత్రి గుర్తు చేశారు. 

1986లో Godavari నదికి  28 లక్షల క్యూసెక్కుల వరదను కేంద్రం జలసంఘం వెల్లడించిందన్నారు.   107.5 మీటర్ల ఎత్తులో కాళేశ్వరం  ప్రాజెక్టు పంప్ హౌస్ నిర్మించామన్నారు. హై లెవెల్ ను దృష్టిలో పెట్టుకునే పంప్ హౌజ్ లు నిర్మిస్తారని మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు. ఈ నెల 14 న కాళేశ్వరం వద్ద గోదావరి వరద మట్టం 1986 లో నమోదు అయిన  హెచ్ఎఫ్ఎల్ కు మించి 108.19 మీటర్లు నమోదైందన్నారు. 

గతంలో Srisailamకి 25 లక్షల క్యూసెక్కుల వరద వస్తే Kurnool నగరం మునిగిన విషయాన్ని మంత్రి ప్రస్తావించారు.ఎత్తిపోతల పథకాలకు, ప్రాజెక్టులకు తేడా తెలియకుండా కాంగ్రెస్ , బీజేపీ నేతలు మాట్లాడుతున్నారని మంత్రి విమర్శించారు. ప్రాజెక్టులను  రీ డిజైనింగ్ చేసి తుమ్మిడిహెట్టి నుండి మేడిగడ్డకు మార్చి కాళేశ్వరరావు వంటి గొప్ప ప్రాజెక్టు ను తమ ప్రభుత్వం నిర్మించిందన్నారు. గోదావరికి వచ్చిన వరద కన్నా  Congress , BJP ల కన్నీటి వరద ఎక్కువైందని మంత్రి సెటైర్లు వేశారు.  

నీటి లభ్యత ఉన్న చోటనే రీ డిజైన్ చేసి  కాళేశ్వరం ఎత్తిపోతలను కేసీఆర్ నిర్మించడాన్ని కాంగ్రెస్, బీజేపీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారని ఆయన విమర్శించారు.కేంద్ర జల వనరుల నిపుణులే ఇది ఇంజనీరింగ్ అద్భుతమని చెప్పిన విషయాన్ని మంత్రి గుర్తు చేశారు. సొంత ప్రాంతానికి మేలు జరుగుతుంటే  కాంగ్రెస్, బీజేపీ నేతలు తట్టుకోలేకపోతున్నారన్నారు.

సాగునీటి విషయంలో తెలంగాణ గొంతుకోసింది   కాంగ్రెస్ పార్టీ అన్నారు. నీటి లభ్యత లేని చోట ప్రాజెక్టులు ప్రతిపాదించి దశాబ్దాల పాటు నిర్మాణాలు సాగదీశారన్నారు.

కాంగ్రెస్ హయాంలో కట్టిన శ్రీశైలం 1998లో, 2009లో మునిగిందని మంత్రి తెలిపారు. .  కల్వకుర్తి ఎత్తిపోతల రెండు సార్లు మునిగిందన్నారు. కాంగ్రెస్ కట్టిన జూరాల ప్రాజెక్టులో నీటిలభ్యత కేవలం ఆరు టీఎంసీలు మాత్రమేనని చెప్పారు.  అందుకే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని  ఉన్న శ్రీశైలం ప్రాజెక్టు పరిధి నుండి తీసుకున్నామని మంత్రి నిరంజన్ రెడ్డి వివరించారు. 

దేశ, విదేశాల ఇంజనీరింగ్ ప్రముఖులు మన ఇరిగేషన్ అధికారి పెంటారెడ్డి సలహాలు తీసుకుంటారన్నారు. అలాంటి Penta Reddyని విమర్శలు చేయడాన్ని మంత్రి నిరజంన్ రెడ్డి తప్పుబట్టారు. తెలంగాణ తొలి ఎత్తిపోతల పథకం ఎలిమినేటి మాధవరెడ్డి ఎత్తిపోతల పథకాన్ని ఆంధ్రా ఇంజనీర్ల కుట్రలను అడ్డుకుని విజయవంతంగా నిర్మించింది పెంటారెడ్డేనని మంత్రి వివరించార. 

పెంటారెడ్డిని అవమానించడమంటే తెలంగాణ ప్రతిభను, తెలంగాణ సమాజాన్ని అవమానించడమే నని మంత్రి చెప్పారు. పెంటారెడ్డిని అవమానించిన వారు భేషరతుగా క్షమాపణ చెప్పకుంటే భవిష్యత్ లో తప్పకుండా సమాధానం చెబుతామని మంత్రి వార్నింగ్ ఇచ్చారు.

అప్పర్ భద్ర ప్రాజెక్టుకు కేంద్రం జాతీయహోదా ఇచ్చిందన్నారు.. బీజేపీ నేతలకు దమ్ముంటే తెలంగాణ ప్రాజెక్టులకు జాతీయ హోదా గురించి పార్లమెంట్ లో  పోరాటం చేయాలని  మంత్రి డిమాండ్ చేశారు.

ధాన్యం కొనుగోళ్లలో కేంద్రం కక్షపూరితంగా వ్యవహరిస్తుందని మంత్రి మండిపడ్డారు. కేంద్రం తీసుకున్న బియ్యానికే డబ్బులు చెల్లిస్తుందన్నారు. తప్పనిసరై తాను పౌరసరపరాల శాఖ మంత్రిగా కొనసాగుతున్నానని Piyush Goyal  వ్యాఖ్యలు చేశారని తెలంగాణ మంత్రి నిరంజన్ రెడ్డి చెప్పారు. వ్యవసాయంపై కేంద్ర మంత్రికి పీయూష్ గోయల్ కు అవగాహన లేదన్నారు. 
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios