ఖరీఫ్ సీజన్ ప్రారంభం కావడంతో.. రైతులు పంటలు వేసేందకు సిద్దమయ్యారు. ఈ క్రమంలోనే తెలంగాణ రైతులకు రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి శుభవార్త అందించారు. త్వరలోనే రైతుల ఖాతాల్లో రైతుబంధు డబ్బులు జమచేస్తామని చెప్పారు.
ఖరీఫ్ సీజన్ ప్రారంభం కావడంతో.. రైతులు పంటలు వేసేందకు సిద్దమయ్యారు. ఈ క్రమంలోనే తెలంగాణ రైతులకు రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి శుభవార్త అందించారు. త్వరలోనే రైతుల ఖాతాల్లో రైతుబంధు డబ్బులు జమచేస్తామని చెప్పారు. రైతులు ఎవరూ అపోహ పడవద్దని తెలిపారు. బుధవారం మంత్రి నిరంజన్ రెడ్డి హైదరాబాద్ నాంపల్లి పబ్లిక్ గార్డెన్‌లోని రైతుబంధు సమితి కార్యాలయంలో వ్యవసాయశాఖ కాల్ సెంటర్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కొన్ని రాజకీయ కారణాలతో నిధులు రాలేదని తెలిపారు. కేంద్రం కావాలనే ఇబ్బంది పెడుతుందని, తామే నిధులు సమకూర్చుకొని రైతుల ఖాతాల్లో వేస్తామని ప్రకటించారు.
ఇప్పటికే ముఖ్యమంత్రి కేసీఆర్ ఆర్థిక, వ్యవసాయశాఖలకు ఆదేశాలు జారీ చేశారని మంత్రి నిరంజన్ రెడ్డి చెప్పారు. ఈసారి కూడా సకాలంలోనే రైతుల ఖాతాల్లో రైతుబంధు సొమ్ము జమచేస్తామని చెప్పారు. రైతులను పత్తి పంట ఎక్కువగా వేయాలని సూచించారు. రైతుల సమస్యల పరిష్కారాల కోసం కాల్ సెంటర్ ప్రారంభించామని చెప్పుకొచ్చారు. రైతులకు ఏమైనా సమస్యలుంటే ఈ కాల్ సెంటర్ కు ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు. త్వరలోనే టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేస్తామన్నారు.
ఇక, తెలంగాణ ప్రభుత్వం రైతు బంధు స్కీమ్ కింద.. రైతులకు ఎకరాకు రూ.5వేల చొప్పున ఏడాదిలో రెండు పంటలకు రూ.10వేల పెట్టుబడి సాయం అందజేస్తున్నది. జూన్ 1న ఖరీఫ్ సీజన్ ప్రారంభమై 20 రోజులు దాటినా.. రాష్ట్ర ప్రభుత్వం రైతుబంధు సాయాన్ని రైతుల బ్యాంకు ఖాతాల్లోకి జయచేయలేదు. సాధారణంగా జూన్ ప్రారంభంలో ఖరీఫ్ లబ్ధిదారుల జాబితాను ఖరారు చేస్తున్న ప్రభుత్వం.. రెండో వారంలో నిధులు విడుదల చేసి జూన్ 15 నుంచి 20 వరకు రైతుల బ్యాంకు ఖాతాల్లోకి జమ చేస్తుంది. అయితే ఈసారి మాత్రం ఆ ప్రక్రియలో ఆలస్యం చోటుచేసుకుంది. దీంతో ప్రభుత్వం రైతు బంధు నిధులు ఎప్పుడు జమ చేస్తుందో అనే విషయంలో స్పష్టత లేకుండా పోయింది. అయితే తాజాగా త్వరలోనే రైతు బంధు డబ్బులు జమచేస్తామని మంత్రి నిరంజన్ రెడ్డి చెప్పడం.. రైతులకు గుడ్ న్యూస్ అనే చెప్పాలి.
