విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందస్వామిని తెలంగాణ మంత్రి మల్లారెడ్డి దంపతులు రుషీకేశ్‌లోని ఆశ్రమంలో కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ సందర్భంగా వచ్చే ఏడాది జనవరిలో మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజీలో నిర్వహించే అశ్వమేధ యాగంలో పాలుపంచుకోవాల్సిందిగా మల్లారెడ్డి స్వామిజీని ఆహ్వానించారు.

స్వరూపానందను కలిసిన వారిలో నరసాపూర్ ఎమ్మెల్యే మదన్ రెడ్డి , రాఘవేందర్ రావు , రంగారావు , డాక్టర్. ఓం ప్రకాష్ ,ఎలక్షన్ రెడ్డి, ప్రసాద్ తదితరులు ఉన్నారు.